గ్రహాల కదలికలో పెను మార్పు: నేడు శుక్ర, శని గ్రహాల సప్తాంక యోగం.. ఈ 3 రాశుల వారికి ఇక డబ్బే డబ్బు!
జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర, శని గ్రహాల కలయిక లేదా పరస్పర దృష్టి వల్ల ఏర్పడే 'సప్తాంక రాజయోగం' అత్యంత శక్తివంతమైనది. నేటి నుండి ప్రారంభం కానున్న ఈ యోగ ప్రభావంతో వృషభ, తులా, మకర రాశుల వారికి అదృష్టం వరించనుంది. ఆర్థికంగా భారీ లాభాలతో పాటు కెరీర్‌లో ఊహించని విజయాలు వీరి సొంతం కాబోతున్నాయి.
శుక్ర, శని గ్రహాల సప్తాంక యోగం: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, సప్తాంక రాజయోగం ఈరోజు ఏర్పడిపోతుంది.

ఇది శుక్రుడు, శని గ్రహాల కారణంగా ఏర్పడనుంది. ఈరోజు యోగం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతుంది? మరి ఈ సప్తాంక యోగంతో ఎవరు ఎలాంటి లాభాలు పొందబోతున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.
శుక్ర, శని గ్రహాల సప్తాంక యోగం.. ఈ రాశుల వారికి భారీ లాభాలు, బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది:
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ రాజయోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరంగా అనేక విధాలుగా లాభాలు కలుగుతాయి. కెరీర్‌లో స్థిరత్వం ఉంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారి బాధ్యతలు కూడా పెరుగుతాయి.
ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. భాగస్వామి నుంచి సపోర్ట్ వస్తుంది. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు.
2.తులా రాశి:
తులా రాశి వారికి ఇది శుభ సమయం. ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. అదృష్టం కూడా పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. ఈ రాశి వారు ముఖ్యమైన ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తారు. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. సానుకూల మార్పులను చూస్తారు. బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది
3.మకర రాశి:
మకర రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. పెండింగ్‌లో ఉన్న టాస్కులను పూర్తి చేస్తారు. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులను సక్సెస్‌ఫుల్‌గా చేపడుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. స్థిరత్వం, పురోగతి కూడా ఉంటుంది. సంతోషంగా వుంటారు. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారంపై, అవి పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనవి అని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడి సలహా తీసుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


