Kindest Zodiac Signs: మృదు స్వభావులు.. దయా హృదయులు! ఈ 4 రాశుల వారు ఎదుటి వారి కోసం ఏదైనా త్యాగం చేస్తారు.. మీ రాశి ఉందా?
Kindest Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవర్తన వారి రాశిపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తులా, కర్కాటక వంటి నాలుగు రాశుల వారు అత్యంత దయాగుణం కలిగిన వారుగా గుర్తించబడ్డారు. వీరు స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.
Kindest Zodiac Signs: మనకి మొత్తం 12 రాశులు. 12 రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. అయితే ఒక్కో రాశి వారి తీరు, ప్రవర్తన ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని రాశుల వారు కొన్నిట్లో దృఢంగా ఉంటే, వాటిలోనే కొన్ని రాశుల వారు బలహీనంగా ఉండొచ్చు. ఈ రోజు పలు రాశుల వారికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

కొంతమంది ఎక్కువ కోపంతో ఉంటారు. కొంత మంది చూసినట్లయితే ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటారు. కొన్ని రాశుల వారి మనసు చాలా విశాలమైనది, ఇట్టే కరిగిపోతుంది. ఎదుటివారి కోసం ఏం చేయడానికైనా కొన్ని రాశుల వారు సిద్ధంగా ఉంటారు. జ్యోతిష లెక్కల ప్రకారం చూసినట్లయితే, ఈ రాశుల వారు చాలా దయతో ఉంటారు. ఎప్పుడూ కూడా ఎలాంటి స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. ఈ రాశుల వారికి దయ ఎక్కువగా ఉంటుంది. మరి ఆ రాశుల వారి గురించి ఇప్పుడే చూసేయండి. వీరిలో మీరు ఉన్నారేమో తెలుసుకోండి.
ఈ రాశుల వారికి దయ చాలా ఎక్కువ.. ఎదుటివారి కోసం ఏమైనా త్యాగం చేస్తారు:
1.తులా రాశి:
తులా రాశి వారు చాలా దయతో ఉంటారు. ఎప్పుడూ కూడా ఇతరులకు సాయం చేయడానికి ముందుంటారు. శుక్రుడు ప్రభావంతో ఈ రాశి వారు ఇతరులు ఏమడిగినా సరే సాయం చేస్తారు. ఈ రాశి వారు డబ్బు కోసం కూడా చూసుకోరు. కుటుంబ సభ్యులనే, స్నేహితుల్ని చాలా బాగా చూసుకుంటారు. ఆపదలో ఎవరు ఉన్నా సరే ఏమాత్రం ఆలోచించరు.
2.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు చంద్రుడి ప్రభావంతో చాలా సున్నితంగా ఉంటారు. దయ కూడా ఎక్కువ. వీరి మనసు వెన్నలా ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడూ ఇతరులకు సాయం చేయడానికి ఒక అడుగు ముందే ఉంటారు. అలాగే ఎవరినైనా ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. డబ్బు కోసం కూడా ఎప్పుడూ చూసుకోరు. కష్టాల్లో ఉంటే మాత్రం వెంటనే ఆదుకుంటారు.
3.ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారి మనసు కూడా చాలా విశాలమైనదే. గురు ప్రభావంతో ఈ రాశి వారు దానధర్మాలు చేయడంలో ముందుంటారు. ఎవరికైనా సహాయం అంటే చాలు పరిగెత్తుకుని వస్తారు. ఈ రాశి వారు ఇతరులకు ఎప్పుడూ కూడా లేదనకుండా సాయం చేస్తారు. ఎప్పుడూ కూడా అవసరమైన వారి కోసం సిద్ధంగా ఉంటారు.
4.మీన రాశి:
మీన రాశి వారు కూడా ఎదుటివారి బాధని తమ బాధగా భావించి సాయం చేయడంలో ముందుంటారు. వారు ప్రేమించిన వారు బాధలో ఉంటే ఏమాత్రం చూసి ఊరుకోలేరు. ఎప్పుడూ కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఏ మాత్రం ఆలోచించకుండా సాయం చేస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


