...
...
Next Story

మీ కిచెన్‌లో కూడా పొయ్యి, సింక్ పక్కపక్కనే ఉన్నాయా? అయితే మీ ఇంట్లో డబ్బు నిలవదు.. ఈ సమస్యలు కూడా రావచ్చు!

మోడ్యులర్ కిచెన్ మోజులో పడి పొయ్యి, సింక్ పక్కపక్కనే పెడుతున్నారా? అగ్ని, జల మూలకాల మధ్య వచ్చే ఈ వైరుధ్యం మీ ఇంట్లో కలహాలకు, ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు. ఆ వాస్తు దోషాలు, పరిష్కారాలు ఇవే.

Published on: Jun 1, 2026, 11:00:35 IST
Advertisement

చాలా మంది ఇంట్లో వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది, ప్రతికూల శక్తి తగ్గుతుంది. వంటగదిలో కూడా కొన్ని వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఇల్లు అందంగా ఉండడంతో పాటు ఆధునిక హంగులతో ఇల్లంతా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. వంటగదిలో కూడా చాలా కొత్త పద్ధతులను పాటిస్తున్నారు.

మీ కిచెన్‌లో కూడా పొయ్యి, సింక్ పక్కపక్కనే ఉన్నాయా? అయితే మీ ఇంట్లో డబ్బు నిలవదు (gemini ai)
మీ కిచెన్‌లో కూడా పొయ్యి, సింక్ పక్కపక్కనే ఉన్నాయా? అయితే మీ ఇంట్లో డబ్బు నిలవదు (gemini ai)

మాడ్యులర్ స్టైల్‌లో వంటగదిని చేయించుకుంటున్నారు. అయితే చాలా మందికి తెలియకో, లేకపోతే ప్లేస్ సరిపోకో, వంటగదిలో గ్యాస్ స్టవ్, సింక్ రెండింటినీ ఒకే స్లాబ్‌పై పక్కపక్కనే పెడుతున్నారు. చూడడానికి ఇది బాగుంటుంది. కానీ వాస్తు ప్రకారం ఇది పెద్ద దోషం అని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. చేసే ఇలాంటి మార్పులు ఇంట్లో ప్రతికూల శక్తిని తీసుకొస్తాయి. సానుకూల శక్తిని దెబ్బతీస్తాయి.

పంచభూతాల సమతుల్యం వాస్తు

వాస్తు అనేది ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పు అనే పంచభూతాల మధ్య సమతుల్యతను కాపాడడంపై ఆధారపడి ఉంటుంది. ఇంట్లో ప్రతి గది కూడా ఒక్కో మూలకాన్ని సూచిస్తుంది. వంటగది విషయానికి వచ్చేసరికి ప్రధానంగా అగ్ని, జలం అనే రెండు శక్తివంతమైన మూలకాలు వంటగదిలో ఉంటాయి. ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ దెబ్బతిన్నట్లయితే మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ప్రతికూల శక్తి వంటి రకరకాల సమస్యలు కలగవచ్చు.

అగ్ని స్వరూపం గ్యాస్ స్టవ్

గ్యాస్ స్టవ్ అగ్ని మూలకానికి ప్రతీక. ఇంట్లో ఉండేవారి ఉత్సాహం, ఆరోగ్యం, సంపద ఇవన్నీ కూడా సరిగ్గా ఉండాలంటే వాస్తు నియమాలను పాటించాలి. వంటగదిలో పొయ్యిని ఆగ్నేయం వైపు ఉంచితే చాలా మంచిది. ఇది శుభ ఫలితాలను అందిస్తుంది. సానుకూల శక్తిని పెంచుతుంది.

కానీ నీరు, నిప్పు పక్కపక్కన ఉంటే ఏమవుతుంది?

ఈ రెండు పక్కపక్కన ఉంటే ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది.

పనుల్లో ఆటంకాలు కూడా వస్తాయి.

కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు, మానసిక ప్రశాంతత దెబ్బతినడం వంటివి చూడొచ్చు.

అలాగే ఈ రెండు పక్కపక్కన ఉండడం వలన ఎంత సంపాదించినా కూడా డబ్బు చేతిలో ఉండదు.

అనవసరమైన ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతాయి.

ఈ రెండు పక్కపక్కన ఉంటే భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి?

ఒకవేళ ఇప్పటికే మీ ఇంట్లో ఇలా ఉంటే మీరు ఏం కంగారు పడకండి. చిన్న మార్పుల ద్వారా దోషాన్ని నివారించవచ్చు. రెండింటి మధ్య కనీసం రెండు అడుగుల దూరం ఉండాలి. అలా కుదరనట్లయితే ఆ రెండింటి మధ్య చిన్న చెక్క బోర్డును పెట్టండి. ఇలా చిన్న పార్టిషన్ చేయడం వలన రెండింటి మధ్య ఘర్షణ ఏర్పడదు. వంటగదిలో దిశలు, అమరికలు సరిగ్గా ఉన్నట్లయితే సుఖశాంతులు కలుగుతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks