వాట్సాప్ డీపీ చూసి మీ వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చా? మీ నిజమైన స్వభావం ఏంటో తెలుసుకోండి!

మీ వాట్సాప్ డీపీ చూసి మీ వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చా? వాట్సాప్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు పెట్టే డిస్ప్లే పిక్చర్ మీ మనస్తత్వానికి అద్దం పడుతుంది. మీరు ఎంచుకునే ఫోటో మీ వ్యక్తిత్వ రహస్యాలను ఎలా బయట పెడుతుందో ఈ కథనంలో చదవండి. 

Published on: Jun 1, 2026, 14:01:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. టెక్నాలజీ కూడా బాగా అభివృద్ధి చెందడంతో, దూరంగా ఉన్న వ్యక్తులతో కూడా సోషల్ మీడియా ద్వారా దగ్గరవ్వచ్చు. డిజిటల్ యుగంలో ఒక వ్యక్తిని నేరుగా కలవకముందే వాట్సాప్ లేదా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ చూసి అంచనాకు వచ్చేస్తున్నారు.

వాట్సాప్ డీపీ చూసి మీ వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చా? మీ నిజమైన స్వభావం ఏంటో తెలుసుకోండి! (gemini ai)
వాట్సాప్ డీపీ చూసి మీ వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చా? మీ నిజమైన స్వభావం ఏంటో తెలుసుకోండి! (gemini ai)

మనం పెట్టే ఫోటో అంతరాత్మకు అర్థం పడుతుందని మనస్తత్వ శాస్త్ర నిపుణులు అంటున్నారు. మనల్ని ఎలా ప్రపంచానికి మనం చూపించాలనుకుంటున్నామో డీపీ నిర్ణయిస్తుంది. అయితే చాలా మంది రకరకాల ప్రొఫైల్ పిక్చర్స్‌ను పెడుతూ ఉంటారు. అయితే దానిని బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ వాట్సాప్ డీపీ మీ గురించి ఏం చెప్తోంది? ఫోటోలో దాగి ఉన్న అసలు స్వభావం

గ్రూప్ ఫోటోలు

కొంతమంది ప్రొఫైల్ పిక్చర్ కింద గ్రూప్ ఫోటోలను పెడుతుంటారు. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను పెడుతుంటారు. అలాంటి వారు ఒంటరిగా ఉండడానికి అసలు ఇష్టపడరు. ఇలాంటి వారు పదిమందితో కలిసి ఉండడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. గ్రూప్ ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్ల కింద పెట్టేవారు బాగా ఎక్స్‌ట్రోవర్ట్స్ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్నేహబంధాలకు, బంధుత్వాలకు వీరు ఎక్కువ విలువ ఇస్తారు. అలాగే వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. కానీ సమూహంలో భాగంగా ఉండడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.

క్లోజ్ సెల్ఫీలు

కొంత మంది క్లోజ్ సెల్ఫీలను డీపీల కింద పెడుతుంటారు. మీరు కూడా అలాగే పెడుతున్నారా? అయితే మీకు మీపై అపారమైన నమ్మకం ఉంది. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ లవ్ అని కూడా అనొచ్చు. ప్రతి చిన్న విషయాలకు సెల్ఫీలు మార్చే అలవాటు ఉన్నట్లయితే, ఇతరుల నుంచి గుర్తింపు లేదా అంగీకారం కోసం చూస్తున్నారని అర్థం. అలాగే లైక్స్, కామెంట్స్ ద్వారా వచ్చే ఆనందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఈ వ్యక్తులు భావిస్తారు.

నేచర్ ఫోటోలు

కొంత మంది ప్రకృతితో ఉన్న ఫోటోలను పెడుతూ ఉంటారు. పచ్చని చెట్లు, అలలు, అందమైన పువ్వులు వంటివి. ఇలాంటివి పెడుతున్నట్లయితే ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. అలాగే అనవసరమైన గొడవలకు కూడా దూరంగా ఉంటారు. ఎక్కువగా ప్రకృతిని ఆస్వాదిస్తారు. అందరితో వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఇష్టపడరు. ఒక రకంగా వీరు ఇంట్రోవర్ట్స్ అని చెప్పొచ్చు.

పెంపుడు జంతువులు, కార్టూన్లు

కొంత మంది కుక్క పిల్లలు, చిన్న పిల్లలు, కార్టూన్స్ వంటివి పెడుతూ ఉంటారు. అలాంటి వారు సున్నిత మనస్కులు. పైగా మానవత్వం ఎక్కువ ఉంటుంది. వారికంటూ ఒక ఊహా ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. అలాగే ఇతరులకు సాయం చేయడానికి కూడా వీరు ఎప్పుడూ ముందుంటారు.

ప్రొఫైల్ పిక్చర్ ఖాళీగా

కొంతమంది ప్రొఫైల్ పిక్చర్‌ను ఖాళీగా వదిలేస్తూ ఉంటారు. అలాంటి వారు రహస్య స్వభావులు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకూడదని అనుకుంటారు. లేకపోతే ఏదైనా మానసిక సంఘర్షణలో ఉన్నారని, ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడట్లేదని అర్థం చేసుకోవాలి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More