ఈ ఆలయంలో కళ్యాణం వీక్షిస్తే పెళ్లి గడియలు మోగుతాయట.. కోనసీమ జిల్లాలో ఉన్న ఈ మహిమాన్విత క్షేత్రం గురించి మీకు తెలుసా?

కోనసీమలోని ప్రసిద్ధ మురమళ్ల శ్రీ వీరేశ్వరస్వామి ఆలయంలో ప్రతి రాత్రి జరిగే నిత్య కల్యాణానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ కల్యాణాన్ని దర్శిస్తే వివాహ అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం

Published on: Jun 6, 2026, 16:30:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య తీరాలని చాలా మంది దేవుళ్లను మొక్కుతారు, రకరకాల పరిహారాలను పాటిస్తారు. అయితే వివాహం అవ్వక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారు ఈ మహిమగల క్షేత్రాన్ని సందర్శించాలి. ఈ ఆలయం విశిష్టత గురించి మీరు కూడా విని ఉంటారు.

ఈ ఆలయంలో కళ్యాణం వీక్షిస్తే పెళ్లి గడియలు మోగుతాయట.. కోనసీమ జిల్లాలో ఉన్న ఈ మహిమాన్విత క్షేత్రం గురించి మీకు తెలుసా?
ఈ ఆలయంలో కళ్యాణం వీక్షిస్తే పెళ్లి గడియలు మోగుతాయట.. కోనసీమ జిల్లాలో ఉన్న ఈ మహిమాన్విత క్షేత్రం గురించి మీకు తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లోని మురమల్ల వీరేశ్వర స్వామి దేవస్థానం చాలా మహిమాన్వితమైనది. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. అందుకే చాలామంది ఇక్కడికి వెళ్తూ ఉంటారు.

మన దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ ఆలయంలో ప్రతిరోజూ రాత్రి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కళ్యాణాన్ని చూడడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తారు. పెళ్లి అవ్వక ఎదురుచూస్తున్న వారు ఈ ఆలయాన్ని ఒక్కసారి సందర్శిస్తే మంచి ఫలితాలు ఉంటాయని భక్తుల నమ్మకం.

ఆలయ పురాణ నేపథ్యం

దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన తర్వాత వీరభద్రుడు ఉగ్రరూపంలో లోకాలను వణికించాడు. అప్పుడు స్వామివారి క్రోధాన్ని శాంతింపజేయడానికి దేవతలందరూ కలిసి ఆదిపరాశక్తిని పూజించగా, అమ్మవారు భద్రకాళి రూపంలో ప్రత్యక్షమయ్యారు. స్వామివారిని శాంతింపజేశారు. ఆ తర్వాత వీరిద్దరికీ గాంధర్వ వివాహం జరిగింది. అయితే మురమళ్లలో వెలసిన స్వామివారి ఉగ్రత్వాన్ని తగ్గించేందుకు అగస్త్య మహర్షి ఇక్కడే నిత్య కళ్యాణం సంప్రదాయాన్ని మొదలుపెట్టారని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ పవిత్ర వేడుకను ఇప్పటికీ దేవతలు, మునులు వీక్షిస్తారని ప్రజల నమ్మకం.

నిత్య కళ్యాణం ఎందుకు?

ఏ దేవాలయంలో అయినా సరే ఏడాదికి ఒకసారి బ్రహ్మోత్సవాల సమయంలో కళ్యాణం చేస్తారు. కానీ మురమల్లలో మాత్రం ఏడాది పొడవునా చేస్తారు. కనుల పండుగగా ఉండే స్వామివారి నిత్య కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇక్కడికి వచ్చి కళ్యాణాన్ని వీక్షిస్తే ఎంతటి వివాహ దోషాలైనా సరే తొలగిపోతాయని అంటారు. కుజదోషం, కాలసర్ప దోషం, రాహు-కేతువుల ప్రభావం వల్ల పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతున్న వారు ఈ కళ్యాణ పూజల్లో పాల్గొంటారు. రోజూ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కళ్యాణ వేడుకను వైభవంగా నిర్వహిస్తారు. పెళ్లి కావాల్సిన వారు తల్లిదండ్రులతో లేదా ఒంటరిగా సంకల్ప పూజలో కూర్చోవచ్చు.

కళ్యాణం పూర్తయిన తర్వాత స్వామివారికి సమర్పించిన పసుపు, కుంకుమ, అక్షింతలను ప్రసాదంగా ఇస్తారు. దీనిని పూజ గదిలో భద్రపరుచుకుంటే మంచిదని భక్తులు భావిస్తారు. అలాగే ఆ కుంకుమను నుదుటన ధరించడం వల్ల మూడు నెలల నుంచి ఏడాది లోపు వివాహం జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు.

టికెట్లు ఎలా కొనుగోలు చేయాలి?

కళ్యాణ పూజలో పాల్గొనాలనుకుంటే ఆన్‌లైన్‌లో లేదా ఆలయ కౌంటర్ల వద్ద టికెట్లను కొనుగోలు చేయొచ్చు. అలాగే ఇక్కడ స్వామివారికి రుద్రాభిషేకాలు, చండీ హోమాలు కూడా నిర్వహిస్తారు. వీటిని వీక్షించడానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More