కార్తీక మాసంలో శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. అందులోనూ ఈ రోజు కోటి సోమవారం, కార్తీక సోమవారం కలిసి వచ్చాయి. కార్తీక మాసంలో శివారాధనకు ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తారు. అలాగే ఆరోజు ఉపవాసం కూడా ఉంటారు.

ఈ రోజు కోటి సోమవారం, కార్తీక సోమవారం.. శ్రవణ నక్షత్రం, శుక్ల సప్తమి తిథి కలయికతో ఈ పర్వదినానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజు భక్తిశ్రద్ధలతో శివుడిని పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అభిషేకాలు చేస్తే పుణ్యం వస్తుంది. దీపారాధన, ఉపవాసం, దానధర్మాలు నిర్వహించడం వలన కోటి రెట్ల ఫలితం ఉంటుందని నమ్ముతారు. శివుడి అనుగ్రహం కోసం ఈ రోజు తప్పకుండా ఈ ఆరు పనులు చేయండి.
కోటి సోమవారం + కార్తీక సోమవారం ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి
కార్తీక మాసం శివకేశవుల ఆరాధనకు అంకితమైన పవిత్రమైన మాసం. ఈ నెలలో శివుడికి అభిషేకం చేస్తే మంచిది. అలాగే బిల్వపత్రాలను సమర్పించాలి. సాయంత్రం దీపాలను వెలిగిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది.
1. జలాభిషేకం చేయండి
ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి శివలింగానికి అభిషేకం చేయాలి. 'ఓం నమఃశివాయ' అనే మంత్రాన్ని జపించాలి.
2. శివుడికి బిల్వపత్రాలను సమర్పించండి
శివుడికి ప్రీతికరమైన బిల్వపత్రాలను సమర్పించండి. మూడు ఆకులు కలిగిన బిల్వదళాలను భక్తిశ్రద్ధలతో సమర్పించాలి.
3. దీపారాధన
సాయంత్రం దీపారాధన చేయండి. తులసి కోట ముందు దీపాలు వెలిగించి పూజ చేయాలి. అలా చేయడం వలన అద్భుతమైన ఫలితం ఉంటుంది. వీలైతే శివాలయంలో కూడా దీపాన్ని వెలిగించొచ్చు.
4. ఓం నమః శివాయ మంత్రం
{{/usCountry}}సాయంత్రం దీపారాధన చేయండి. తులసి కోట ముందు దీపాలు వెలిగించి పూజ చేయాలి. అలా చేయడం వలన అద్భుతమైన ఫలితం ఉంటుంది. వీలైతే శివాలయంలో కూడా దీపాన్ని వెలిగించొచ్చు.
4. ఓం నమః శివాయ మంత్రం
{{/usCountry}}కోటి సోమవారం, కార్తీక సోమవారం వేళ 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపించండి. కుదిరితే శివ చాలీసా, లింగాష్టకం, శివతాండవ స్తోత్రం కూడా పఠించొచ్చు.
5. భక్తిశ్రద్ధలతో ఉపవాసం
కార్తీక సోమవారం వేళ ఉపవాసం ఉండాలి. ఉపవాసం చేసేవారు కావాలంటే పండ్లు, పాలు తీసుకోవచ్చు.
6. పేదలకు అన్నదానం, దానధర్మాలు
కార్తీక సోమవారం, కోటి సోమవారం రోజున అన్నదానం, దానధర్మాలు వంటివి చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.
ఈరోజు మర్చిపోకుండా వీటిని పాటించండి
ఈ రెండు ఒకే రోజు రావడం వలన వీలైనంత ఎక్కువ సమయం శివనామస్మరణతో గడపడం మంచిది. అసూయ, ద్వేషం, కోపం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇతరులను బాధపెట్టకూడదు. పరమేశ్వరుడిని భక్తితో ఆరాధించాలి.