లక్ష దీపాలు వెలిగించినంత పుణ్యం ఇచ్చే క్షీర దీపం.. ఎలా వెలిగించాలి?

కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన మాసం. ఈ నెలలో 30 రోజులూ పరమశివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా దీపారాధనకు ఈ మాసంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రతిరోజూ ఇంట్లో దీపాలు వెలిగిస్తూ శివుడిని ఆరాధించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. 

Published on: Nov 23, 2026, 16:30:22 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

క్షీర దీపం: కార్తీక మాసం విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కార్తీక మాసం 30 రోజుల్లోనూ పరమశివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. కార్తీక మాసంలో వివిధ రకాల దీపాలను కూడా పెడుతూ ఉంటారు. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధించడం వలన మంచి ఫలితం ఉంటుంది.

లక్ష దీపాలు వెలిగించినంత పుణ్యం ఇచ్చే క్షీర దీపం.. ఎలా వెలిగించాలి? కావాల్సిన పదార్థాలు ఇవే! (AI)
లక్ష దీపాలు వెలిగించినంత పుణ్యం ఇచ్చే క్షీర దీపం.. ఎలా వెలిగించాలి? కావాల్సిన పదార్థాలు ఇవే! (AI)

కార్తీక మాసంలో ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి. లక్ష దీపాలు వెలిగించినంత ఫలితాన్ని పొందవచ్చు. మరి లక్ష దీపారాధన ఫలితాన్ని ఇచ్చే ఈ దీపం గురించి ఇప్పుడే చూసేద్దాం.

లక్ష దీపారాధన ఫలితాన్ని ఇచ్చే క్షీర దీపం

కార్తీక మాసంలో క్షీర దీపాన్ని ఈ పద్ధతిలో వెలిగించండి. లక్ష దీపారాధన ఫలితాన్ని పొందవచ్చు.

క్షీర దీపానికి కావాల్సిన పదార్థాలు:

పాలు

ఆవు నెయ్యి

తమలపాకు

పత్తితో చేసిన వత్తులు

వెలిగించడానికి సరైన పద్ధతి:

ముందు ఒక పాత్రలో పాలు పోసుకుని, ఆ పాల పైన ఒక తమలపాకును పెట్టుకోండి. తమలపాకు నడిమధ్యలో ఆవు నెయ్యిలో ముంచిన పత్తి వత్తిని పెట్టండి.

ఆ తర్వాత సరిపడా నెయ్యి వేసుకుని, అగ్గిపుల్లతో కాకుండా అగరబత్తీ లేదా దీపారాధనతో వెలిగించండి. ఈ దీపారాధన వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆయురారోగ్యాలను పొందవచ్చు. కార్తీక మాసంలో ఏదో ఒక రోజు ఈ దీపాన్ని వెలిగిస్తే మంచిది. పౌర్ణమి రోజు అయినా ఈ దీపం వెలిగించవచ్చు.ఈ దీపాన్ని వెలిగిస్తే లక్ష దీపాలు వెలిగించినంత పుణ్యం వస్తుంది. అలాగే ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు.

కార్తీక మాసంలో ఈ మంత్రాలను, శ్లోకాలను చదువుకోండి

శివ పంచాక్షరి మంత్రం:

ఓం నమః శివాయ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. పరమశివుడికి నమస్కారం చేసుకుని ఈ మంత్రాన్ని చదివితే ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

తులసీ దేవి శ్లోకం:

తులసి శ్రీ సఖి శుభే పాపహారిణి పుణ్యదే

నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే

ఈ తులసీదేవి శ్లోకాన్ని చదివితే పాపాలు తొలగిపోతాయి. పుణ్యం వస్తుంది. తులసి అనుగ్రహం లభిస్తుంది.

దీపారాధన శ్లోకం:

దీపజ్యోతిః పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః

దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే..

దీపారాధన శ్లోకం:

శుభం కరోతి కల్యాణం శుభం కరోతి కల్యాణం

ఆరోగ్యం ధనసంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే

ఈ శ్లోకాన్ని ఎప్పుడు దీపం వెలిగించినా చదువుకోండి. మంచి ఫలితం ఉంటుంది. పవిత్రమైన దీపం మనలోని అజ్ఞానాన్ని తొలగించాలని ప్రార్థిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం.

ABOUT THE AUTHOR

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు