కార్తీక మాసంలో వచ్చే పర్వదినాల్లో క్షీరాబ్ది ద్వాదశి చాలా ముఖ్యమైనది. ప్రతి ఏటా శుక్లపక్ష ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుక ద్వాదశి అంటారు. ఈరోజు వచ్చిన ద్వాదశి చాలా విశేషమైనది. ఈ రోజు చాలా మంది తులసి కల్యాణాన్ని కూడా నిర్వహిస్తారు. అలాగే తులసి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. తులసి కోట దగ్గర దీపారాధన చేస్తారు. ప్రదక్షిణాలు చేస్తారు. తులసమ్మకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు భక్తిగా చేయండి. అలాగే ఈ పాట పాడుతూ చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఈ పాటను ఆలపిస్తే సంపద, సౌభాగ్యం కూడా కలుగుతాయి.
తులసి అమ్మవారి ప్రదక్షిణం పాట

గోపు ప్రదక్షిణం నీకిస్తున్నమ్మా
గోవింద సన్నిధి నాకియ్యవమ్మా
ఒంటి ప్రదక్షిణం నీకిస్తున్నమ్మా
వైకుంఠ సన్నిధి నాకియ్యవమ్మా
రెండో ప్రదక్షిణం నీకిస్తున్నమ్మా
నిండైన సంపదలు నాకియ్యవమ్మా
మూడో ప్రదక్షిణం నీకిస్తున్నమ్మా
ముత్తైదవతనం నాకియ్యవమ్మా
నాల్గో ప్రదక్షిణం నీకిస్తున్నమ్మా
నవధాన్య రాసులను నాకియ్యవమ్మా
అయిదో ప్రదక్షిణం నీకిస్తున్నమ్మా
ఆయువు దోషనం నాకియ్యవమ్మా
ఆరో ప్రదక్షిణం నీకిస్తున్నమ్మా
ఆయువై దోతనం నాకియ్యవమ్మా
ఏడో ప్రదక్షిణం నీకిస్తున్నమ్మా
వెన్నని ఏకాంత సేవియ్యవమ్మా
ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తున్నమ్మా
యమునిచే బాధలు తప్పించవమ్మా
తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తున్నమ్మా
తోడుగా కన్నులకు తోడయ్యవమ్మా
పదో ప్రదక్షిణం నీకిస్తున్నమ్మా
పద్మాక్షి నీ సేవ నాకియ్యవమ్మా
ఎవరూ పాడిన యేకానీ మరణం
పుణ్యస్తులు పాడితే పుత్రసంతానం..
రామ తులసి, లక్ష్మీ తులసి
నిత్యం మా ఇంట కొలువై విలసిల్లవమ్మా..
ఉసిరి చెట్టు
కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి కొమ్మను తులసి కోట దగ్గర పెట్టి తులసిని, ఉసిరిని పూజిస్తారు. ఆ సమయంలో ఈ 21 నామాలను పఠిస్తూ పూజ చేయండి. ఈ నామాలను జపించడం వలన విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ రోజు తులసి అష్టోత్తరం చదువుతూ తులసమ్మకు భక్తితో పూజ చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
ఉసిరి చెట్టు వద్ద చదవాల్సిన 21 నామాలు
1. ఓం ధాత్ర్యై నమః
{{/usCountry}}1. ఓం ధాత్ర్యై నమః
{{/usCountry}}2. ఓం శాంత్యై నమః
3. ఓం కాంత్యై నమః
4. ఓం మేధాయై నమః
5. ఓం కళ్యాణ్యై నమః
6. ఓం విష్ణుప్రియాయై నమః
7. ఓం మహాలక్ష్మ్యై నమః
8. ఓం ప్రకృత్యై నమః
9. ఓం ఇందిరాయై నమః
10. ఓం సుధృత్యై నమః
11. ఓం రమాయై నమః
12. ఓం లోకమాత్రే నమః
13. ఓం అబ్చితనయయై నమః
14. ఓం గాయత్రి నమః
15. ఓం సావిత్రయ్ నమః
16. ఓం విశ్వరూపాయై నమః
17. ఓం సురూపాయై నమః
18. ఓం కమనీయాయై నమః
19. ఓం అవ్యక్తయై నమః
20. ఓం కమలాయై నమః
21. ఓం జగద్ధాత్ర్యై నమః
చేయకూడని పనులు
- ద్వాదశి రోజు తులసి మొక్కను ఆరాధించేటప్పుడు ఆ ప్రదేశం అపరిశుభ్రంగా లేకుండా చూసుకోవాలి. ఎప్పుడూ కూడా తులసి మొక్క ఉండే చోటు శుభ్రంగా ఉండాలి. చెప్పులు, చెత్తాచెదారం వంటివి అక్కడ లేకుండా చూసుకోవాలి.
- అలాగే ఈ రోజు కోపం, కలహాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఏమాత్రం గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది.
- పూజలను మధ్యలో ఆపడం మంచిది కాదు. భక్తితో ప్రారంభించిన పూజను శ్రద్ధగా పూర్తి చేయండి.
- ఈరోజు సాధ్యమైనంత వరకు పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేయండి. అద్భుతమైన ఫలితం ఉంటుంది.
- వెలిగించిన దీపాలను నిర్లక్ష్యం చేయకూడదు.
- మాంసాహారం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి వాటికి ఆహారానికి దూరంగా ఉండాలి.
ABOUT THE AUTHOR
పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు