...
...
Next Story

ఈ పొరపాట్లు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహం.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఈ అలవాట్లు వెంటనే మార్చుకోండి!

ఈ 5 అలవాట్లు లక్ష్మీమాతను కోపంగా ఉంచుతాయి, నేడు మెరుగుపడండి. చీపురు ఇవ్వడం మరియు సాయంత్రం పూట శుభ్రం చేయడం మానుకోండి, లేనిపక్షంలో ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. లక్ష్మీ కృపను కాపాడుకోవడానికి సులభమైన మార్గాలను తెలుసుకోండి.

Published on: Aug 9, 2026, 12:01:17 IST
Advertisement

హిందూ ధర్మంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతో భక్తితో పూజలు చేస్తుంటాం. అయితే, మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఇంట్లో దరిద్రానికి దారితీస్తాయని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. ఆర్థిక సమస్యలు దూరమై సిరి సంపదలు వెల్లివిరియయాలంటే ఏయే అలవాట్లకు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకోండి.

ఈ పొరపాట్లు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహం.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఈ అలవాట్లు వెంటనే మార్చుకోండి!
ఈ పొరపాట్లు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహం.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఈ అలవాట్లు వెంటనే మార్చుకోండి!

ఇంట్లో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు నిలకడగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం నిత్యం దేవుడిని ప్రార్థించడంతో పాటు ఎన్నో పూజలు చేస్తుంటారు. అయితే, మన ఇంట్లోని కొన్ని పొరపాట్లు, మనం తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పులు లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏడేడు తరాల సంపద నిలవాలన్నా, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలన్నా కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి. ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. చీపురును ఎవరికీ ఇవ్వొద్దు

మన సాంప్రదాయంలో చీపురును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. అందుకే దీనిని ఎప్పుడూ కాలుతో తొక్కకూడదు, అగౌరవపరచకూడదు. ముఖ్యంగా మన ఇంట్లో ఉపయోగించే చీపురును ఎవరికీ ఉచితంగా లేదా అప్పుగా ఇవ్వకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి మన ఇల్లు విడిచి వెళ్ళిపోతుందని నమ్ముతారు. అలాగే చీపురును ఎల్లప్పుడూ ఇతరుల కంటికి పడకుండా శుభ్రమైన ప్రదేశంలో భద్రపరచాలి.

2. సాయంత్రం వేళ ఈ తెల్లటి వస్తువులు ఇవ్వొద్దు

సూర్యాస్తమయం అయిన తర్వాత వంటగదిలోని పాలు, పెరుగు, ఉప్పు, పంచదార వంటి తెల్లటి పదార్థాలను ఇతరులకు అప్పుగా ఇవ్వడం అశుభం. ఈ వస్తువులు శుక్రుడికి ప్రతీకగా భావిస్తారు. సాయంత్రం వేళ వీటిని బయటకు ఇస్తే ఇంట్లోని లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోయి, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి ఈ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

3. భార్య దాచుకున్న సొమ్మును తాకవద్దు

భార్యకు సంబంధించిన బంగారు లేదా వెండి నగలను ఇతరులకు తాకట్టు పెట్టడానికో, లేదంటే వాడుకోవడానికో ఎక్కువ కాలం అప్పుగా ఇవ్వడం మంచిది కాదు. కొద్దిసేపు ధరించడానికి ఇవ్వడం వేరు, కానీ రోజుల తరబడి వాటిని ఇతరుల చేతిలో ఉంచితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఇది భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు దారితీయడంతో పాటు, ఆర్థిక అస్థిరతను తెస్తుంది.

5. సాయంత్రం వేళ చీపురుతో ఊడ్చడం మానుకోండి

ఇంట్లో ఉదయం లేదా మధ్యాహ్న సమయాల్లోనే ఇల్లు ఊడ్చి శుభ్రం చేసుకోవాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత చీపురు పెట్టడం హిందూ శాస్త్రాల ప్రకారం నిషిద్ధం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి నివాసం ఉండే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. ఈ చిన్న నియమాలను పాటిస్తే చాలు, ఇంట్లో సానుకూల శక్తి పెరిగి సిరిసంపదలకు కొదవ ఉండదు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe