ఈ అలవాట్లు ఉన్నవారి ఇంటికి లక్ష్మీదేవి రాదట.. చాణక్య నీతి ఏమి చెబుతోంది?
ఆచార్య చాణక్యుడు తెలిపిన నీతి ప్రకారం, వ్యక్తి ప్రవర్తన, క్రమశిక్షణ, పరిశుభ్రత, మృదువైన మాటలు, కష్టపడే తత్వం, మితాహారం, ఆర్థిక నిగ్రహం వంటి మంచి అలవాట్లే సంపదకు పునాది. అపరిశుభ్రత, దుర్భాష, ప్రణాళిక లేకుండా ఖర్చు చేయడం వంటి దురలవాట్లు ఉంటే లక్ష్మీదేవి కటాక్షం లభించదని చాణక్యుడు పేర్కొన్నారు
సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రతి ఒక్కరూ పరితపిస్తుంటారు. అయితే, ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవడానికి మన దైనందిన అలవాట్లే ప్రధాన కారణమని ఆచార్య చాణక్యుడు స్పష్టం చేశారు.

చాణక్య నీతి ప్రకారం, మనిషి ప్రవర్తన, క్రమశిక్షణే అతని ఆర్థిక స్థితిగతులను నిర్ణయిస్తాయి. కొన్ని రకాల దురలవాట్లు ఉన్నవారి ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదని, వచ్చినా ఎక్కువ కాలం నిలవదని ఆయన హెచ్చరించారు.
అపరిశుభ్రత, చెడు అలవాట్లు
చాణక్య నీతిలోని ఓ ప్రముఖ శ్లోకం ప్రకారం.. ఎల్లప్పుడూ మురికి బట్టలు ధరించడం, దంతాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత లోపించిన వారిని లక్ష్మీదేవి అసలు ఆదరించదు. కేవలం అదృష్టం ఉంటే సరిపోదు, శరీర శుచి, మంచి ఆచారాలు ఉన్నప్పుడే సంపద స్థిరంగా ఉంటుందని చాణక్యుడు తేల్చిచెప్పారు.
కఠినమైన మాటలు, దుర్భాషలాడటం
మాట్లాడే తీరు మనిషి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఎల్లప్పుడూ ఎదుటివారిని నొప్పించేలా మాట్లాడేవారు, కఠినమైన పదాలను ప్రయోగించేవారు లేదా నిత్యం వ్యతిరేక భావాలతో ఉండేవారి ఇళ్లలో సిరిసంపదలు కొలువుండవు. మృదువైన మాటలు ఉన్నచోటే లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు.
అతి నిద్ర, సోమరితనం
సూర్యోదయానికి ముందే మేల్కొనడం, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవడం ఆరోగ్యానికి, సంపదకు కూడా హానికరమని చాణక్యుడు పేర్కొన్నారు. సోమరితనంతో పనులను వాయిదా వేసేవాళ్ళు, బద్ధకంతో జీవితాన్ని గడిపేవాళ్లను లక్ష్మీదేవి ఎప్పుడూ దూరం పెడుతుంది. కష్టపడే తత్వమే మనిషిని సంపన్నుడిని చేస్తుంది.
అతిగా తినడం, నియంత్రణ లేకపోవడం
ఆహారపు అలవాట్లపై అజమాయిషీ లేనివారు, జిహ్వ చాపల్యం వల్ల మోజుపడి ఎంతపడితే అంత తినేవాళ్ళు ఆర్థిక ఇబ్బట్లను ఎదుర్కొంటారు. ఆశను అదుపులో ఉంచుకోలేని వారి జీవితంలో ఆర్థిక స్థిరత్వం కరవవుతుంది.
ఆర్థిక నిగ్రహం లేకపోవడం
సంపాదనకు మించి ఖర్చు చేయడం, ఎలాంటి ప్రణాళిక లేకుండా డబ్బును దుబారా చేయడం వల్ల ఎంతటి ధనవంతుడైనా త్వరలోనే పేదవాడైపోతాడు. కష్టకాలంలో ఉపయోగపడుతుందనే స్పృహ లేకుండా జీవించేవారికి సమాజంలో గౌరవం కూడా దక్కదు. కాబట్టి సంపాదించిన దాంట్లో కొంత పొదుపు చేయడం, ఆలోచించి ఖర్చు చేయడం అత్యంత ఆవశ్యకం.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


