చాలామంది ఇళ్లలో ఎక్కువ బల్లులు ఉంటాయి. బల్లులు ఆకస్మాత్తుగా మనపై పడితే భయం కలుగుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం చూసినట్లయితే మనపై బల్లి పడడం ప్రమాదం లేదా దురదృష్టంగా భావించకూడదు. భవిష్యత్తు సూచనగా అర్థం చేసుకోవాలి. బల్లి ఒక శకునం వంటిదని పెద్దలు అంటూ ఉంటారు.
శరీర భాగంపై బల్లి పడితే దాని ఫలితం ఎలా ఉంటుంది?

శరీరంలోని ఒక్కో భాగంపై బల్లి పడినప్పుడు ఒక్కో రకమైన ఫలితం ఉంటుందని నమ్ముతారు. కొన్నిసార్లు అదృష్టానికి చిహ్నంగా భావించాలి. మరికొన్నిసార్లు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్‌గా తీసుకోవాలి. మరి ఏ శరీర భాగంపై బల్లి పడితే ఎలాంటి ఫలితం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
నుదుటిపై బల్లి
బల్లి నేరుగా నుదుటిపై పడితే సామాజిక గౌరవానికి, పాత బంధాలకు సంకేతంగా భావిస్తారు. ఈ భాగంపై బల్లి పడినట్లయితే అత్యంత ఆత్మీయులు, పాత స్నేహితులు లేదా బంధువులను కలిసే అవకాశం ఉందని శాస్త్రం తెలుపుతోంది. ఈ భాగంపై బల్లి పడితే శుభవార్తలు పొందవచ్చు. నిలిచిపోయిన పనులు కూడా మళ్లీ పూర్తవుతాయి.
తలపై బల్లి
శిరస్సుపై బల్లి పడినట్లయితే ఆర్థిక లాభం అని అర్థం చేసుకోవాలి. ఈ భాగంపై బల్లి పడటం వలన గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయట. జీవితంలో ఒక పెద్ద అవకాశం మీ వద్దకు రాబోతోందని అర్థం. కెరీర్‌లో కూడా మంచి మార్పులను చూడొచ్చు.
కాళ్లు, చేతులపై బల్లి
కాళ్లు, చేతులపై బల్లి పడితే ఏమవుతుందనే విషయానికి వస్తే, చేతిపై బల్లి పడితే విజయాన్ని అందుకోవచ్చు. ఆర్థికంగా కూడా లాభాలు కలగబోతున్నాయని అర్థం. కాళ్లపై బల్లి పడితే అధిక శ్రమ, పనుల్లో సవాళ్లకు సంకేతంగా భావించాలి. మీరు చాలా బిజీ అయిపోవచ్చు. మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి.
ముక్కుపై బల్లి
ముక్కుపై బల్లి పడితే ఆరోగ్యానికి సంబంధించిన హెచ్చరికగా అర్థం చేసుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే ఆహారపు అలవాట్లు, జీవనశైలి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
{{/usCountry}}ముక్కుపై బల్లి పడితే ఆరోగ్యానికి సంబంధించిన హెచ్చరికగా అర్థం చేసుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే ఆహారపు అలవాట్లు, జీవనశైలి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
{{/usCountry}}వీటిని మూఢనమ్మకాలుగా చూడకూడదు. సంస్కృతిలో భాగమైనటువంటి బల్లి శాస్త్రం లేదా శకున శాస్త్రం కోణంలో అర్థం చేసుకుంటే మంచిది. ఏదేమైనా బల్లి పడితే ఆందోళన చెందకండి. స్నానం చేసి ఇష్టదైవాన్ని ఆరాధించండి.
భుజంపై బల్లి
భుజంపై బల్లి పడితే విజయానికి చిహ్నంగా భావించాలి. కుడి భుజంపై బల్లి పడితే పనుల్లో తిరుగులేని విజయాన్ని అందుకోబోతున్నారని అర్థం. శత్రువులపై గెలుపు, సమాజంలో పెరిగే పరపతిని కుడి భుజంపై బల్లి పడటం సూచిస్తుంది.
ఎడమ భుజంపై బల్లి పడితే మాత్రం మానసిక ఆందోళనను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వీపుపై బల్లి
వీపుపై బల్లి పడితే ఆర్ధిక లాభాలు. ఊహించని విధంగా పేరు ప్రఖ్యాతలు పొందుతారని దీనికి అర్థం.
కళ్లపై బల్లి
కళ్లపై బల్లి పడితే మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. కుడి కన్నుపై బల్లి పడితే ఆర్థిక లాభం కలుగుతుందని భావిస్తారు. ఆకస్మికంగా డబ్బు మీ చేతికి వస్తుందని అర్థం. ఎడమ కన్నుపై బల్లి పడితే ఆర్థిక నష్టం అని అర్థం చేసుకోవాలి. ఖర్చులు పెరగొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని బల్లి సూచిస్తుందని చెబుతారు.