Vinayaka mantras for Success : భారతీయ సనాతన ధర్మంలో విఘ్నేశ్వరుడిని అడ్డంకులను తొలగించే విఘ్నహర్తగా, బుద్ధి ప్రదాతగా ఆరాధిస్తారు. ఏ పూజ అయినా…. ఏ నూతన కార్యం అయినా మొదట వినాయకుడి ప్రార్థనతోనే ప్రారంభమవడం మన సంప్రదాయం. నిజమైన భక్తి శ్రద్ధలతో లంబోదరుడిని కొలిస్తే జీవితంలో ఎలాంటి కష్టాలైనా మంచులా కరిగిపోతాయని, నిలిచిపోయిన పనులు సైతం వేగంగా పూర్తవుతాయని భక్తుల నమ్మకం. జ్ఞానానికి, విద్యకు, సర్వతోముఖాభివృద్ధికి అధిపతి అయిన గణపతిని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు సానుకూల శక్తి (పాజిటివ్ ఎనర్జీ) పెరుగుతుంది.
వాస్తు శాస్త్రంలో, జ్యోతిష్య శాస్త్రంలో కూడా వినాయక ఆరాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. నిత్యం స్వామివారిని పూజించడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు, ప్రతికూల శక్తులు నశించి సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ కెరీర్‌లో, చదువులో లేదా వ్యాపారంలో వరుసగా ఆటంకాలు ఎదురవుతుంటే, జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్న కొన్ని అత్యంత సులువైన, శక్తివంతమైన పరిహారాలను ఇక్కడ తెలుసుకుందాం.
గణనాథుడికి మోదకాలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బుధవారం రోజున స్వామివారికి మోదకాలను నైవేద్యంగా సమర్పిస్తే ఆయన త్వరగా ప్రసన్నుడవుతాడు. నైవేద్యం పెట్టే సమయంలో మీ మనసులోని కోరికను స్వామివారికి నివేదించుకోవాలి. ఈ పరిహారం చేయడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడం, విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరగడం, వ్యాపారులకు లాభాలు రావడం వంటి శుభఫలితాలు కలుగుతాయి.
అడ్డంకులను తుడిచిపెట్టే గరిక…
వినాయక పూజలో గరికకు ప్రత్యేక స్థానం ఉంది. గణేశుడికి 21 లేదా 108 గరిక పూసలను (దుర్వా గడ్డి) సమర్పించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. గరికను స్వామివారి పాదాల చెంత ఉంచే సమయంలో మీ జీవితంలో వేధిస్తున్న ప్రధాన సమస్యను లేదా అడ్డంకిని మనసులో తలుచుకుంటూ ప్రార్థించాలి. పనులు మధ్యలోనే ఆగిపోతూ తీవ్ర నిరాశలో ఉన్నవారికి ఈ గరిక పరిహారం ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేస్తుంది.
ఆర్థిక బలాన్నిచ్చే ఎర్ర కుంకుమ…
గణేశుడికి ఎరుపు రంగు వస్తువులన్నా, ఎర్రటి పూలన్నా అత్యంత ప్రీతి. పూజ సమయంలో వినాయకుడి విగ్రహానికి లేదా చిత్రపటానికి ఎర్రటి కుంకుమతో తిలకం దిద్దాలి. దీనివల్ల జాతకంలోని దోషాలు తొలగిపోవడమే కాకుండా ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ పరిహారం అఖండ విజయాన్ని చేకూరుస్తుంది.
ఈ మంత్రాలను జపించండి…
{{/usCountry}}గణేశుడికి ఎరుపు రంగు వస్తువులన్నా, ఎర్రటి పూలన్నా అత్యంత ప్రీతి. పూజ సమయంలో వినాయకుడి విగ్రహానికి లేదా చిత్రపటానికి ఎర్రటి కుంకుమతో తిలకం దిద్దాలి. దీనివల్ల జాతకంలోని దోషాలు తొలగిపోవడమే కాకుండా ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ పరిహారం అఖండ విజయాన్ని చేకూరుస్తుంది.
ఈ మంత్రాలను జపించండి…
{{/usCountry}}స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్ర జపం అత్యంత సులువైన మార్గం. నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చుని ఈ క్రింది మంత్రాలను భక్తితో పఠించండి:
- వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ.. నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా.. (ఈ మంత్రం ద్వారా మీ పనులన్నీ అడ్డంకులు లేకుండా సాగిపోతాయి.)
- ఓం గం గణపతయే నమః (ఈ మూల మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.)
- ఓం గ్లాం గౌరీ పుత్ర వక్రతుండ గణపతి గురు గణేష్ గణపతి రిద్ధి పతి మేరే దూర్ కరో క్లేష్ (ఈ మంత్రాన్ని ఉదయం లేదా సాయంత్రం వేళల్లో జపించడం వల్ల ఇంట్లోని గొడవలు, కష్టాలు తొలగిపోతాయి.)
- ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు వరుసగా 11 రోజుల పాటు ఈ మంత్రాలను జపిస్తే, ఎలాంటి శ్రమ లేకుండానే మీ పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
ఈ ఆధ్యాత్మిక పరిహారాలు చేసేటప్పుడు కేవలం యాంత్రికంగా కాకుండా, పూర్తి విశ్వాసంతో చేయడం ముఖ్యం. పూజా స్థలాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ పరిహారాలు చేసే రోజుల్లో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రానివ్వకూడదు. ముఖ్యంగా వినాయక చవితి, సంకష్టహర చతుర్థి లేదా బుధవారాల్లో ఈ ప్రత్యేక పూజలు చేయడం వల్ల వంద శాతం ఫలితం ఉంటుంది.