...
...
Next Story

Lord Shani: ఈ శని దేవుని ఆలయాలకు వెళ్తే, ఏలినాటి శని దోషం తొలగిపోవచ్చు!

జాతకంలో శని స్థానం బలంగా ఉంటే ఆనందంగా ఉండొచ్చు, ధనవంతులు అవ్వచ్చు. శని దేవుని దృష్టి ప్రతికూలంగా ఉన్నట్లయితే, ఏ ప్రయత్నం చేసినా కూడా ఎంత కష్టపడినా సరే ఏ మాత్రం ఫలితం రాదు. ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగ పరంగా సమస్యలు రావచ్చు, వ్యాపారంలో నష్టాలు, ఆర్థికపరంగా ఇబ్బందులు కలుగుతాయి.

Published on: Dec 11, 2025, 12:00:16 IST
Advertisement

శని దేవుడిని న్యాయానికి అధిపతి అంటారు. శని మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. మంచే చేస్తే మంచి ఫలితాలు, చెడు చేస్తే చెడ్డ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాతకంలో శని స్థానం బలంగా ఉంటే ఆనందంగా ఉండొచ్చు, ధనవంతులు అవ్వచ్చు. అదే ఒకవేళ శని దేవుని దృష్టి ప్రతికూలంగా ఉన్నట్లయితే, ఏ ప్రయత్నం చేసినా కూడా ఎంత కష్టపడినా సరే ఏ మాత్రం ఫలితం రాదు. రకరకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

భారతదేశంలో చూడాల్సిన శక్తివంతమైన శని దేవాలయాలు (pinterest)
భారతదేశంలో చూడాల్సిన శక్తివంతమైన శని దేవాలయాలు (pinterest)

ఉద్యోగ పరంగా సమస్యలు రావచ్చు, వ్యాపారంలో నష్టాలు, ఆర్థికపరంగా ఇబ్బందులు ఇలాంటివన్నీ కలుగుతాయి. చాలా మంది శని దోషాలతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి వాటితో బాధ పడుతూ ఉంటారు. అలాంటి వారు శని దేవుని ఆలయానికి వెళ్లి ఆవాల నూనె, నల్ల నువ్వులను సమర్పిస్తే శని దోష ప్రభావం నుంచి బయటపడొచ్చు. శని దోషాల నుంచి బయటపడడానికి శని ఆలయానికి వెళ్తే కూడా మంచిది. భారతదేశంలో ఉన్న ప్రముఖ శని దేవాలయాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భారతదేశంలో చూడాల్సిన శక్తివంతమైన శని దేవాలయాలు

1.శని ఆలయం, కర్ణాటక

కర్ణాటకలోని తుంకూర్ జిల్లాలో ఈ శని ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ శని దేవుడు కాకిపై కూర్చుని దర్శనమిస్తాడు. శని దోషాలతో బాధపడేవారు శనీశ్వరుడిని ఆరాధిస్తే సమస్యలు తొలగిపోతాయి.

2.తిరునల్లార్ దేవాలయం, తమిళనాడు

తమిళనాడులో తంజావూర్ జిల్లాలో ఈ శని ఆలయం ఉంది. రెండు నదుల మధ్య ఆలయం ఉంటుంది. ఇక్కడ శనితో పాటు శివుడిని కూడా ఆరాధిస్తారు. ఇలా చేయడం వలన శని దోషాలు తొలగిపోతాయని నమ్మకం.

3.శని శింగనాపూర్, మహారాష్ట్ర

ఢిల్లీలోని ఛత్తర్‌పూర్‌లో ఉన్న ఈ శని ధామ్ ఆలయం కూడా ప్రసిద్ధమైన ఆలయం. ఇక్కడ అత్యంత ఎత్తైన శని విగ్రహం ఉంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు శని దేవుణ్ని ఆరాధించడానికి వస్తారు. ఇక్కడ స్నానం చేసి ఆవాల నూనెను సమర్పిస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks