ఈరోజు వైకుంఠ ఏకాదశి వేళ విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ పువ్వులను సమర్పించండి, కష్టాలు తీరిపోవచ్చు!

వైకుంఠ ఏకాదశి వేళ విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ పూలను సమర్పిస్తే విష్ణువు అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు. ఏ విధమైన బాధలు ఉండవు. పైగా, ఈరోజు పుత్రదా ఏకాదశి కూడా. పుత్రదా ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధిస్తే పుత్రుడు జన్మిస్తాడని. ఈ ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధించడం వలన ఆనందంగా ఉండొచ్చని నమ్ముతారు.

Published on: Dec 30, 2025, 08:00:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విష్ణువు అనుగ్రహం కలగాలని వివిధ రకాల మార్గాలను అనుసరిస్తారు. ముఖ్యంగా ఏకాదశి తిథి నాడు విష్ణువుని ఆరాధిస్తే ఎంతో మేలు కలుగుతుందని, అనుకున్నవన్నీ పూర్తవుతాయని నమ్మకం. విష్ణు అనుగ్రహంతో దేనికీ లోటు ఉండదు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి చాలా విశేషమైనది. ఇంత విశిష్టత కలిగిన ఏకాదశి నాడు విష్ణువును భక్తి, శ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఉంటే ఎంతో మేలు కలుగుతుంది. బాధలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు.

ఈరోజు వైకుంఠ ఏకాదశి వేళ విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ పువ్వులను సమర్పించండి (pinterest)
ఈరోజు వైకుంఠ ఏకాదశి వేళ విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ పువ్వులను సమర్పించండి (pinterest)

అలాగే, విష్ణువుకి ఎంతో ఇష్టమైన ఈ పూలను సమర్పిస్తే విష్ణువు అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు. ఏ విధమైన బాధలు ఉండవు. పైగా, ఈరోజు పుత్రదా ఏకాదశి కూడా. పుత్రదా ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధిస్తే పుత్రుడు జన్మిస్తాడని, అలాగే పిల్లలు ఉన్నవారు ఈ ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధించడం వలన పిల్లల అభివృద్ధికి తోడ్పడుతుందని, ఆనందంగా ఉండొచ్చని నమ్ముతారు. ఎంతో విశేషమైన వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి నాడు విష్ణువుకి ఈ పువ్వులను సమర్పించండి.

ఈరోజు విష్ణువుకి ఈ పూలను సమర్పించండి

1.గులాబీ పువ్వులు:

గులాబీ పువ్వులను విష్ణువుకి సమర్పించండి. ఎర్ర గులాబీలను విష్ణువుకి, లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారం, ఉద్యోగంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి.

2.పారిజాతం పువ్వులు:

పారిజాతం పువ్వులు కూడా విష్ణువుకి ఎంతో ఇష్టం. పారిజాతం పువ్వులను విష్ణుమూర్తికి ఈ వైకుంఠ ఏకాదశి నాడు సమర్పిస్తే అనేక లాభాలు కలుగుతాయి. పారిజాతం పువ్వులు విష్ణువుకి సమర్పించడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సంతోషం, సంపద కలిగి జీవితంలో పైకి రావచ్చు. అనుకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి.

3.తామర పువ్వులు:

విష్ణువుకి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులను కూడా సమర్పించండి. వీటిని సమర్పించడం వలన ఆనందం, సంపద కలుగుతాయి. పసుపు లేదా ఎర్రటి తామర పువ్వులను విష్ణువుకి ఈ వైకుంఠ ఏకాదశి నాడు సమర్పించండి.

4.కదంబ పువ్వులు:

విష్ణువుకి, లక్ష్మీదేవికి కదంబ పువ్వులను సమర్పిస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది. విష్ణు అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు. అలాగే సువాసన వచ్చే మల్లె, కదంబ, సంపంగి పుష్పాలను కూడా విష్ణువుకి సమర్పించవచ్చు.

5.విష్ణుకాంత:

విష్ణువుకి ఈ విష్ణుకాంత పువ్వులను సమర్పిస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది. ఇవి విష్ణువుకి ఎంతో ప్రీతికరమైనవి. కనుక ఈ ఏకాదశి నాడు విష్ణువుకి వీటిని కూడా సమర్పించండి.

6.తులసి దళాలు:

విష్ణువుకి తులసి దళాలను కూడా తప్పక సమర్పించండి. ఇవి లేనిదే విష్ణువుకి చేసిన పూజ సంపూర్ణం కాదు. కాబట్టి కచ్చితంగా తులసి దళాలను ఏకాదశి ముందు రోజే కోసుకొని విష్ణువుకి సమర్పించడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More