ప్రతి ఒక్కరూ ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ ఒక్కోసారి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి లేదా ప్రేమ అనేది ఒక మలుపు లాంటిది. కొంతమంది జంటలను చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఉంటారు. కొంతమంది మాత్రం ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే రాశిచక్రాల మధ్య ఉండే తత్వాల వలన ఇలా జరగవచ్చని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ప్రేమిస్తున్న వ్యక్తి లేదా జీవిత భాగస్వామి రాశి ప్రకారం మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మీరు కూడా ఈ ఆసక్తికరమైన విషయాన్ని చూద్దామనుకుంటున్నారా? మరి ఇక పూర్తిగా చదివేసేయండి.
అగ్నితత్వ రాశులు

మేష రాశి, సింహ రాశి, ధనస్సు రాశులను అగ్నితత్వ రాశులు అంటారు. ఈ రాశుల వారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. మీ భాగస్వామి కూడా ఇదే తత్వానికి చెందినట్లయితే మీ మధ్య బంధం బాగుంటుంది. మీ బంధంలో ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశుల వారు సాహసాలను ఎక్కువగా ఇష్ట పడతారు. అయితే అగ్నితత్వానికి చెందిన రాశుల వారికి చిన్నపాటి అహంకారం ఉంటుంది. ఒకరికి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు తగ్గితే మాత్రం బంధం ఆనందంగా సాగుతుంది.
భూతత్వ రాశులు
కన్యా రాశి, వృషభ రాశి, మకర రాశి వారు భూతత్వానికి చెందిన వారు. ఈ రాశుల వారు చాలా వాస్తవికంగా ఆలోచిస్తారు. అలాగే స్థిరత్వం అంటే ఈ రాశుల వారికి చాలా ఇష్టం. మీ భాగస్వామి కూడా ఈ రాశుల్లో ఉన్నట్లయితే మీ మధ్య బంధం చాలా బాగుంటుంది. భావోద్వేగాల కంటే బాధ్యతలకు ఈ రాశుల వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉంటారు. కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటారు.
వాయు తత్వ రాశులు
కుంభ రాశి, తులా రాశి, మిథున రాశి వారు వాయు తత్వానికి చెందినవారు. ఈ రాశుల వారు బాగా కమ్యూనికేట్ చేయగలరు. అలాగే ఇద్దరి మధ్య మాటలు, చర్చలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశుల వారు స్వతంత్రంగా ఉండడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. భాగస్వామికి స్వేచ్ఛను కూడా ఇస్తారు. బంధాన్ని ఆనందంగా, సరదాగా ముందుకు తీసుకువెళ్తారు. ఈ రాశుల వారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రయాణాలు అంటే కూడా ఈ రాశుల వారికి మహా ఇష్టం.
జలతత్వ రాశులు
{{/usCountry}}కుంభ రాశి, తులా రాశి, మిథున రాశి వారు వాయు తత్వానికి చెందినవారు. ఈ రాశుల వారు బాగా కమ్యూనికేట్ చేయగలరు. అలాగే ఇద్దరి మధ్య మాటలు, చర్చలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశుల వారు స్వతంత్రంగా ఉండడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. భాగస్వామికి స్వేచ్ఛను కూడా ఇస్తారు. బంధాన్ని ఆనందంగా, సరదాగా ముందుకు తీసుకువెళ్తారు. ఈ రాశుల వారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రయాణాలు అంటే కూడా ఈ రాశుల వారికి మహా ఇష్టం.
జలతత్వ రాశులు
{{/usCountry}}వృశ్చిక, కర్కాటక, మీన రాశి వారు జలతత్వానికి చెందినవారు. వీరు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ప్రేమను, అనురాగాన్ని పంచడంలో వీరికి మించిన వారు ఎవరు ఉండరని చెప్పొచ్చు. భాగస్వామి ఈ రాశికి చెందినట్లయితే చెప్పకుండానే మీ మనసులో మాటను వారు బాగా అర్థం చేసుకుంటారు. మీ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. కానీ అప్పుడప్పుడు చిన్న విషయాలకు కూడా బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఎవరికి కెమిస్ట్రీ బాగా ఉంటుంది?
ఒకే తత్వానికి చెందిన రాశుల వారికి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అగ్ని, వాయు తత్వాల మధ్య.. భూమి, జల తత్వాల మధ్య అవగాహన బాగుంటుంది. జాతక చక్రంలో లగ్నం, చంద్రుడి స్థితిని బట్టి కూడా కెమిస్ట్రీలో మార్పులు ఉంటాయి.