Lunar Eclipse August 2026 : ఖగోళ ప్రేమికులతో పాటు అటు ఆధ్యాత్మిక సమాజంలోనూ 2026 నాటి చంద్రగ్రహణంపై ఒక ప్రత్యేకమైన ఆసక్తి, ఉత్సాహం నెలకొన్నాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఒక అరుదైన ఖగోళ దృగ్విషయం జరగబోతోంది. 2026 సంవత్సరంలోనే రెండోది మరియు చివరిదైన ఈ చంద్రగ్రహణం సరిగ్గా పౌర్ణమి తిథి రోజున సంభవించనుంది.

సాధారణంగానే పౌర్ణమి రోజున వచ్చే చంద్రగ్రహణానికి హిందూ మత శాస్త్రాలలో ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే…. ఈసారి మరింత విశేషం ఏమిటంటే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం పవిత్రమైన రక్షాబంధన్ (రాఖీ పండుగ) రోజే రాబోతోంది. దీనితో సోదరసోదరీమణుల అనురాగ వేడుకపై ఈ గ్రహణ ప్రభావం ఉంటుందా..? లేదా..? అనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది.
రక్షాబంధన్ రోజే 'బ్లడ్ మూన్'.. ఎప్పుడు? ఎక్కడ?
శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథి రోజున దేశమంతటా రక్షాబంధన్ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. జ్యోతిష్య గణనల ప్రకారం.. ఈసారి ఆగస్టు 28, 2026న ఈ పండుగ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది.
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం 'సంపూర్ణ చంద్రగ్రహణం' (Total Lunar Eclipse) కావడం విశేషం. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోతాడు. దీనినే శాస్త్ర సాంకేతిక భాషలో, సాధారణ వాడుకలో 'బ్లడ్ మూన్' (Blood Moon) అని పిలుస్తారు. సూర్యుడు, చంద్రుడికి మధ్యలోకి భూమి వచ్చినప్పుడు.. భూమి యొక్క దట్టమైన నీడ చంద్రుడిని పూర్తిగా కప్పివేయడం వల్ల ఈ అద్భుతమైన ఎరుపు రంగు కాంతి మనకు గోచరిస్తుంది.
ఈ ఖగోళ అద్భుతం ప్రధానంగా యూరప్, అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికా ఖండంతో పాటు పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతాలలో స్పష్టంగా కనిపిస్తుంది.
భారతదేశంపై దీని ప్రభావం ఉంటుందా…?
{{/usCountry}}ఈ ఖగోళ అద్భుతం ప్రధానంగా యూరప్, అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికా ఖండంతో పాటు పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతాలలో స్పష్టంగా కనిపిస్తుంది.
భారతదేశంపై దీని ప్రభావం ఉంటుందా…?
{{/usCountry}}రాఖీ పండుగ రోజే గ్రహణం వస్తుండటంతో భారతీయులలో నెలకొన్న ప్రధాన సందేహాన్ని జ్యోతిష్య పండితులు నివృత్తి చేశారు. ఈ ఆగస్టు 28న సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఏ గ్రహణమైనా సరే మన కంటికి కనిపించనప్పుడు…. దాని వల్ల వచ్చే 'సూతక కాలం' (దోష సమయం) మన దేశానికి వర్తించదు.
కాబట్టి…. గ్రహణ సూతక నియమాలు కానీ, పూజా నిరోధాలు కానీ మనకు ఉండవు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎటువంటి భయాందోళనలు, టెన్షన్లు లేకుండా ఎప్పటిలాగే రక్షాబంధన్ పండుగను, రాఖీ కట్టే ముహూర్తాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవచ్చు.
శాస్త్రీయంగా ఇదొక ఖగోళ ప్రక్రియ అయినప్పటికీ.. హిందూ సంస్కృతిలో గ్రహణ కాలానికి, ఆ తర్వాత చేసే క్రతువులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గ్రహణం ఎక్కడైనా సంభవించినప్పుడు విశ్వంలో వచ్చే మార్పుల దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు పాటించడం శుభప్రదమని నమ్ముతారు. గ్రహణ సమయం ముగిసిన తర్వాత ఇళ్లను శుభ్రం చేసుకోవడం, పవిత్ర స్నానాలు ఆచరించడం ఉత్తమం. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి, పేదలకు శక్తి కొలది దానం చేయడం వల్ల అపారమైన పుణ్యఫలం లభిస్తుందని వేద పండితులు పేర్కొంటున్నారు.