...
...
Next Story

మహాలక్ష్మీ రాజయోగం 2026: ఈ 3 రాశులకు అదృష్టం.. ధనలాభం!

నవంబర్ 1, 2026న కర్కాటక రాశిలో సంచరిస్తున్న కుజుడు (అంగారకుడు), చంద్రుడి కలయికతో అరుదైన మహా లక్ష్మి రాజయోగం ఏర్పడింది. ఈ గ్రహాల కలయిక నవంబర్ 3 వరకు కొనసాగనుంది. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం ధనం, ఉద్యోగం, వ్యాపారం, అదృష్టం వంటి అంశాలపై శుభప్రభావాన్ని చూపుతుందని భావిస్తారు.

Published on: Nov 2, 2026, 11:00:18 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక ఎప్పుడూ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సరిగ్గా అదే కోవలో, నవంబర్ 1, 2026 నాటికి ఆకాశంలో అత్యంత శక్తివంతమైన 'మహా లక్ష్మి రాజయోగం' ఆవిర్భవించింది. ఇప్పటికే కర్కాటక రాశిలో సంచరిస్తున్న అంగారకుడు (మంగళుడు) వద్దకు, మనస్సుకుకారకుడైన చంద్రుడు చేరుకోవడంతో ఈ అరుదైన శుభయోగం రూపుదిద్దుకుంది.

మహాలక్ష్మీ రాజయోగం 2026: నవంబర్ 3 వరకు ఈ 3 రాశులకు అదృష్టం.. ధనలాభం! (AI)
మహాలక్ష్మీ రాజయోగం 2026: నవంబర్ 3 వరకు ఈ 3 రాశులకు అదృష్టం.. ధనలాభం! (AI)

నవంబర్ 3 వరకు ఈ గ్రహాల కలయిక కొనసాగనుంది. జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం, ఈ రెండు గ్రహాల శక్తి కలగలిసి కొన్ని రాశుల వారికి అపారమైన ధనలాభాన్ని, కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించే అదృష్టాన్ని ప్రసాదిస్తోంది.

ముఖ్యంగా కన్య, తులా, వృశ్చిక రాశుల జాతకులకు ఈ రెండు రోజులు స్వర్ణయుగంగా మారబోతున్నాయి. మరి ఈ రాజయోగం ఏ రాశులకు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వివరంగా తెలుసుకుందాం.

మహా లక్ష్మి రాజయోగం ఎలా ఏర్పడింది?

వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం, మేష, వృశ్చిక రాశులకు అధిపతి అయిన కుజుడు, చల్లని గ్రహమైన చంద్రుడితో కలిసి కర్కాటక రాశిలో కలవడాన్ని అత్యంత పవిత్రమైన 'మహా లక్ష్మి రాజయోగంగా' అభివర్ణిస్తారు. కర్కాటక రాశికి చంద్రుడే అధిపతి కావడం విశేషం.

సొంత ఇంటిలో చంద్రుడు ఉండగా, పరాక్రమానికి ప్రతీక అయిన కుజుడు తోడవడంతో ఈ యోగం తాలూకు ప్రభావం వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు ఒక రాశిలో సుమారు రెండున్నర రోజులు మాత్రమే సంచరిస్తారు కాబట్టి, నవంబర్ 3 వరకు మాత్రమే ఈ ప్రభావం ఉంటుంది. ఈ స్వల్ప వ్యవధిలోనే వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ ఆర్థిక ప్రయత్నాలలో అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కన్య రాశి:

ఉద్యోగంలో ఉన్నవారికి పైఅధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరును గుర్తించి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారస్తులు తమ పాత నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని భారీ లాభాలను ఆర్జిస్తారు. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. స్టాక్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడులు పెట్టే వారికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు.

తులా రాశి:

తులా రాశి వారికి ఈ రాజయోగం పదవ స్థానమైన 'కర్మ స్థానంలో' ఏర్పడింది. ఈ స్థానం ప్రధానంగా ఉద్యోగం, వ్యాపారం, హోదా, సమాజంలో పేరు ప్రఖ్యాతులను సూచిస్తుంది. ఈ యయోగ ప్రభావంతో తులా రాశి వారి వృత్తి జీవితం ఒక్కసారిగా పుంజుకుంటుంది. చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందే అవకాశం ఉంది.

ఒకవేళ ఉద్యోగం మారలన్నా లేదా కంపెనీ మారాలని ఆలోచిస్తుంటే, ఇది సరైన తరుణం. మీకు ఊహించని విధంగా మంచి ఆఫర్లు వస్తాయి. వ్యాపార రంగంలో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. ఇన్నాళ్లుగా వెంటాడుతున్న వృత్తిపరమైన ఒత్తిళ్లు తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ అంకితభావమే మీకు భవిష్యత్తులో తిరుగులేని విజయాలను తెచ్చిపెడుతుంది.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి ఈ మహా లక్ష్మి రాజయోగం తొమ్మిదవ స్థానమైన 'భాగ్య స్థానంలో' రూపుదిద్దుకుంది. ఈ స్థానం అదృష్టం, దైవబలం, ఉన్నత విద్య మరియు సుదూర ప్రయాణాలను సూచిస్తుంది. దీంతో ఈ రాశివారికి అదృష్టం పూర్తిగా వెన్నంటి ఉంటుంది. తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనే కలలు కనే విద్యార్థులకు లేదా ఉద్యోగస్తులకు అనుకూలమైన వార్తలు వింటారు. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు కుదురుతాయి. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తుల పరిచయం భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఏ నిర్ణయమైనా ఆత్మవిశ్వాసంతో తీసుకుంటే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks