...
...
Next Story

మహాలక్ష్మి రాజయోగం: కుజ, చంద్రుల కలయికతో శక్తివంతమైన రాజయోగం, 3 రాశులకు అదృష్టం, ధనవంతులు అవుతారు!

ఒక్కోసారి రెండు మూడు గ్రహాల కలయిక కూడా చోటు చేసుకుంటుంది. ఆ సమయంలో కొన్ని రాశుల వారు అద్భుతమైన ఫలితాలను ఎదుర్కొనే అవకాశముంది. నవంబర్ 20న, అంటే మరో ఐదు రోజుల్లో చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడుతో సంయోగం చెందుతాడు. కుజ, చంద్రుల కలయిక ద్వాదశ రాశుల వారి జీవితంలో మార్పులను తీసుకువస్తుంది.

Published on: Nov 15, 2025, 15:00:16 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కోసారి రెండు మూడు గ్రహాల కలయిక కూడా చోటు చేసుకుంటుంది. ఆ సమయంలో కొన్ని రాశుల వారు అద్భుతమైన ఫలితాలను ఎదుర్కొనే అవకాశముంది. నవంబర్ 20న, అంటే మరో ఐదు రోజుల్లో చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు.

మహాలక్ష్మి రాజయోగం: కుజ, చంద్రుల కలయికతో శక్తివంతమైన రాజయోగం (pinterest)
మహాలక్ష్మి రాజయోగం: కుజ, చంద్రుల కలయికతో శక్తివంతమైన రాజయోగం (pinterest)

కుజుడుతో సంయోగం చెందుతాడు. కుజ, చంద్రుల కలయిక ద్వాదశ రాశుల వారి జీవితంలో మార్పులను తీసుకువస్తుంది. కుజుడు సొంత రాశి వృశ్చిక రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ 7 వరకు అదే రాశిలో సంచారం చేస్తాడు. ఆనందంగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. చంద్రుడు, కుజుల కలయిక ఏ రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది? ఈ మహాలక్ష్మి రాజయోగం వలన ఏ రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు తెలుసుకుందాం.

మహాలక్ష్మి రాజయోగం:

చంద్రుడు, కుజుడు వృశ్చిక రాశిలో సంయోగం చెందడంతో ఈ మహాలక్ష్మి రాజయోగం ఏర్పడనుంది. ఇది మూడు రాశుల వారికి ఎక్కువ లాభాలను తీసుకురాబోతోంది. మరి అదృష్ట రాశులు ఎవరు? ఆ రాశుల్లో మీరు ఒకరేమో తెలుసుకోండి.

1.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం అద్భుతమైన ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఈ రాశివారు సక్సెస్‌ను అందుకుంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఉద్యోగులకు పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయం. ఆనందంగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు.

2.వృశ్చిక రాశి

మీన రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. సమస్యలన్నీ తొలగిపోతాయి. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks