అద్భుతమైన రాహువు, శుక్రుల సంయోగం.. ఈ 3 రాశుల వారికి శుభం, అన్ని వైపుల నుండి సంపద కురిపిస్తుంది!
రాహువు, శుక్రుడు ధనం, అదృష్టం, విజయాలు వంటి వాటిని తీసుకురాబోతున్నారు. శుక్రుడు నవంబర్ 25న తులా రాశిలో ఉంటాడు. ఆ సమయంలో నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతోంది. కొన్ని రాశుల వారికి మాత్రం విపరీతమైన లాభాలు కలుగుతాయి. అదృష్టం కూడా ఉంటుంది.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు రెండు, మూడు గ్రహాల కలయిక కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి.

త్వరలోనే నవపంచమ రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకు రాబోతోంది. ప్రస్తుతం రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శుక్రుడు తులా రాశిలో ఉన్నాడు. ఈ రెండు గ్రహాలు నవ పంచమ రాజయోగాన్ని ఏర్పరస్తున్నాయి.
రాహువు, శుక్రుల సంయోగం
రాహువు, శుక్రుడు ధనం, అదృష్టం, విజయాలు వంటి వాటిని తీసుకురాబోతున్నారు. శుక్రుడు నవంబర్ 25న తులా రాశిలో ఉంటాడు. ఆ సమయంలో నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతోంది. కొన్ని రాశుల వారికి మాత్రం విపరీతమైన లాభాలు కలుగుతాయి. అదృష్టం కూడా ఉంటుంది. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
1.ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి రాహువు–శుక్రులు శుభ ఫలితాలు లభించబోతున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. అదృష్టం కలిసి వస్తుంది. సక్సెస్‌ను అందుకుంటారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది శుభసమయం. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఆర్థికపరంగా బాగానే ఉంటుంది.
2.తులా రాశి
తులా రాశి వారికి రాహువు, శుక్రుల కారణంగా ఏర్పడే యోగం మంచి ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఎక్కువ లాభాలను పొందుతారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. సంతోషం పెరుగుతుంది. పిల్లల విషయంలో కూడా ఆనందాన్ని చూస్తారు. అయితే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థికపరంగా లాభాలను పొందుతారు. ప్రశాంతత కూడా ఉంటుంది.
3.కుంభ రాశి
కుంభ రాశి వారికి రాహువు, శుక్రుల కారణంగా ఏర్పడే నవ పంచమ రాజయోగం మంచి ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఉద్యోగస్తులు ఎక్కువ లాభాలను పొందుతారు. ప్రమోషన్లు వంటివి చూస్తారు. వ్యాపారస్తులకు కూడా మంచి సమయం వెతుక్కుంటూ వస్తుంది. సంతోషం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. అయితే ఈ సమయంలో ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


