అమావాస్య తిధికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి నెలలో కూడా ఒక అమావాస్య వస్తుంది. అమావాస్య అంటే పూర్వికులను స్మరించుకుని తర్పణాలు సమర్పించడం, అన్నదానాలు చేయడం, వస్త్రదానాలు చేయడం.. ఇలా ఎవరికి నచ్చిన వాటిని వారు అనుసరిస్తూ ఉంటారు. అయితే, ఎప్పుడూ వచ్చే ఈ మహాలయ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది.

మహాలయ అమావాస్య నాడు చాలా మంది పూర్వికులను తలుచుకుని మంచి పనులు చేస్తూ ఉంటారు. నిజానికి, మహాలయ అమావాస్యను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే విశేషమైన ఫలితాలను పొందవచ్చు. ఇంతకీ ఈ మహాలయ అమావాస్య ఎప్పుడు వచ్చింది? తేదీతో, సమయంతో పాటుగా ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు, పాటించాల్సిన పరిహారాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం.
మహాలయ అమావాస్య 2026 ఎప్పుడు వచ్చింది?
2026లో మహాలయ అమావాస్య శనివారం, అక్టోబర్ 10న వచ్చింది. అమావాస్య తిథి అక్టోబర్ 9 రాత్రి సుమారు 9:36 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 10 రాత్రి 9:19 గంటలకు ముగుస్తుంది. ఈ లెక్కన చూస్తే అక్టోబర్ 10న శనివారం నాడు మహాలయ అమావాస్యను జరుపుకోవాలని, పితృ కార్యాలకు ఇది అనువైన రోజు.
పితృ తర్పణం, శ్రార్ధ కార్యక్రమాలను అపరాహ్న సమయంలో, అంటే మధ్యాహ్నం సుమారు 1:14 నుంచి 3:36 గంటల మధ్య చేస్తే అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సంప్రదాయం, ప్రాంతీయ పంచాంగం ప్రకారం కాస్త ఆ సమయాల్లో మార్పులు ఉండొచ్చు.
మహాలయ అమావాస్య రోజు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు
1.నువ్వుల దానం:
నువ్వుల దానం చేస్తే చాలా మంచిది. అలాగే ధాన్యం కూడా ఈ మహాలయ అమావాస్య నాడు దానం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
2.పితృ తర్పణం:
{{/usCountry}}నువ్వుల దానం చేస్తే చాలా మంచిది. అలాగే ధాన్యం కూడా ఈ మహాలయ అమావాస్య నాడు దానం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
2.పితృ తర్పణం:
{{/usCountry}}నువ్వులు కలిపిన నీటిని పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణంగా సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి పితృ తర్పణాలు కూడా చేయండి.
3.అన్నదానం:
అవసరమైన వారికి అన్నదానం చేస్తే కూడా విశేషమైన ఫలితాలను పొందవచ్చు. అన్నదానాల కంటే అన్నదానం అనేది చాలా మంచిది. అలాగే పండ్లు, ధాన్యం, ఇతర ఆహార పదార్థాలను కూడా మహాలయ అమావాస్య నాడు దానం చేస్తే మంచిదే.
4.కాకులకు, గోవులకు ఆహారం:
మహాలయ అమావాస్య నాడు కాకులకు, గోవులకు కూడా ఆహారాన్ని అందించడం శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది. కనుక కుదిరితే వీటికి ఆహారాన్ని అందించండి.
5.వస్త్ర దానం:
మహాలయ అమావాస్య నాడు వస్త్రదానం చేయడం కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. కనుక ఆ రోజు వస్త్రదానం చేస్తే కూడా మంచిది.
6.పూర్వికుల స్మరణ:
ఇంట్లో దీపం వెలిగించి పూర్వికులను భక్తిశ్రద్ధలతో స్మరించుకోండి. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించండి. ఇది కూడా చాలా మంచి అలవాటు.
శ్రాద్ధం, పిండప్రదానం వంటి కర్మలను మీ కుటుంబ ఆచారాల ప్రకారం, పురోహితుల సూచనల మేరకు చేయండి.