అక్టోబర్ 10 శనివారం+అమావాస్య.. ఈ రాశులకు లాభాలు, ఆ రాశులకు అప్రమత్తత అవసరం!

హిందూ సంప్రదాయంలో పితృపక్షం ముగింపు సందర్భంగా వచ్చే సర్వపితృ అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 2026లో ఈ అమావాస్య అక్టోబర్ 10, శనివారం రావడంతో దీనిని శనైశ్చరి అమావాస్యగా కూడా భావిస్తున్నారు.  

Published on: Oct 5, 2026, 12:15:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హిందూ సంప్రదాయంలో పితృ పక్షం ముగింపు దశకు చేరుకునే తరుణంలో వచ్చే అమావాస్యకు అత్యంత విశిష్టత ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 10, 2026 శనివారం రోజున అమావాస్య పర్వదినం రావడం విశేషం. ముఖ్యంగా ఇదే రోజు సర్వపితృ అమావాస్య కూడా కలిసి రావడంతో దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ ఏడాది పితృ పక్షం అద్భుతమైన శనైశ్చరి అమావాస్యతో ముగియనుంది.

అక్టోబర్ 10 శని+అమావాస్య.. ఈ రాశులకు లాభాలు, ఆ రాశులకు అప్రమత్తత అవసరం!
అక్టోబర్ 10 శని+అమావాస్య.. ఈ రాశులకు లాభాలు, ఆ రాశులకు అప్రమత్తత అవసరం!

జ్యోతిష్య గణనల ప్రకారం, అక్టోబర్ 9వ తేదీ రాత్రి 9:35 గంటలకు ప్రారంభమయ్యే అమావాస్య తిథి, అక్టోబర్ 10వ తేదీ రాత్రి 9:19 గంటల వరకు కొనసాగుతుంది. శనివారం నాడు శని దేవుని పూజకు ఎంత ప్రాధాన్యత ఉందో, అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణాలు, శ్రాద్ధాలు మరియు దాన ధర్మాలు చేయడం అంతకంటే ఎక్కువ పుణ్యఫలాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఈ అరుదైన గ్రహ స్థితి వల్ల ద్వాదశ రాశులపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మరి కొన్ని రాశుల వారికి ఇది అనుకూల సమయంగా మారుతుంది.

మకర, కుంభ, మీన రాశుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

శని దేవుని ప్రభావం ఎక్కువగా ఉండే మకర, కుంభ, మీన రాశుల జాతకులు ఈ శనిశ్చరి అమావాస్య రోజున ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలి.

మకర రాశి: ఈ రాశికి అధిపతి అయిన శని ప్రభావం వల్ల వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు విపరీతంగా పెరుగుతాయి. పాత పనులను పూర్తి చేయడానికి శ్రమ మరింత ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనవసరపు ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. అధికారులతో సత్సంబంధాలు కాపాడుకోవడం ద్వారా ఇబ్బందులను తొలగించుకోవచ్చు.

కుంభ రాశి: కుంభ రాశిలోనూ శని సంచారం కారణంగా పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. తలపెట్టిన పనుల ఫలితాలు ఆలస్యంగా అందవచ్చు. బడ్జెట్ అదుపు తప్పుకుండా చూసుకోవడం ముఖ్యం. ఎవరికీ అప్పులు ఇవ్వడం గానీ, సరైన అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టడం గానీ చేయకండి.

మీన రాశి: మీన రాశిలో ప్రస్తుతం శని సంచరిస్తున్న తరుణంలో ఈ అమావాస్య ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. మానసిక ఆందోళన తగ్గడానికి, శని దోష నివారణకు ఈ రోజు దానధర్మాలు చేయడం ఎంతో మేలు చేస్తుంది.

వృషభ, తులా రాశులకు ఊరట, లాభాలు

శని అనుగ్రహం లేదా సానుకూల స్థితిలో ఉన్న వృషభ మరియు తులా రాశి వారికి ఈ అమావాస్య అనేక శుభ ఫలితాలను తీసుకురానుంది.

వృషభ రాశి: చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగ రంగంలో పైఅధికారుల మద్దతు లభించడంతో ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపారస్తులు తమ పాత నెట్‌వర్క్ ద్వారా మంచి లాభాలను ఆర్జిస్తారు.

తులా రాశి: ఆగిపోయిన పనులు మళ్లీ పట్టాలెక్కుతాయి. ఆఫీసులో నూతన బాధ్యతలు మీ ప్రతిభను చాటుకునేలా చేస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో కుటుంబంలో నెలకొన్న ఆందోళనలు తొలగిపోతాయి.

ఈ అమావాస్య రోజున ఏం చేయాలి?

ఎవరి మరణ తేదీ గుర్తు లేని వారికి, లేదా ఆ ఏడాదిలో పితృ పక్షంలో శ్రాద్ధం చేయించుకోని వారందరికీ ఈ సర్వపితృ అమావాస్య రోజునే తర్పణాలు విడిచిపెట్టే ఆచారం ఉంది. ఈ పవిత్ర రోజున పేదలకు అన్నదానం చేయడం, బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, నిరుపేదలకు వస్త్రాలు లేదా నవ్వులు దానం చేయడం వల్ల పితృ దేవుల ఆశీస్సులు పరిపూర్ణంగా లభిస్తాయని నమ్ముతారు. పూజలో భాగంగా శని దేవునికి ఆవనూనెతో దీపం వెలిగించి పూజించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More