Vastu: సింహద్వారం వద్ద ఇవి ఉన్నాయా? అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదు!

Vastu: ఇంటి ప్రధాన ద్వారం వద్ద చేసే చిన్నపాటి పొరపాట్లు లక్ష్మీదేవి రాకను అడ్డుకుంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మీ ఆర్థిక ఎదుగుదలకు అడ్డంకిగా మారే ఆ వస్తువులు ఏవి? వాటిని ఎలా సరిచేసుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

Published on: May 14, 2026, 16:00:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం అనేది చాలా ముఖ్యమైనది. ప్రధాన ద్వారం విషయంలో కొన్ని పొరపాట్లు జరిగితే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంటి సింహద్వారం మనుషుల రాకపోకలు సాగించే దారి మాత్రమే కాదు, ఇంటికి సానుకూల శక్తిని తీసుకువచ్చే మార్గం. ముఖద్వారాన్ని మనం సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాము.

Vastu: సింహద్వారం వద్ద ఇవి ఉన్నాయా? అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదు! (pinterest)
Vastu: సింహద్వారం వద్ద ఇవి ఉన్నాయా? అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదు! (pinterest)

సింహద్వారం ఎంత శుభ్రంగా, అలంకరణగా ఉంటుందో అంత సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవహిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. సింహద్వారం విషయంలో తెలియక చేసే తప్పుల వలన దరిద్రం చుట్టుముట్టే అవకాశం ఉంటుంది.

సింహద్వారం దగ్గర ఇవి ఉన్నాయా? అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదు

1.శుభ్రత లేని చోట

శుభ్రత లేని చోట లక్ష్మీదేవి ఉండదు. సింహద్వారం బయట చెత్తాచెదారం ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదని గుర్తుపెట్టుకోండి. ఇంటి సింహద్వారం శుభ్రంగా ఉండాలి. మురికి, దుమ్ము లేకుండా చూసుకోవాలి. సాయంత్రం వేళలో ప్రధాన ద్వారం దగ్గర చెత్త కవర్లు వంటివి ఉండకూడదు. పనికిరాని సామాన్లు వంటివి ముఖద్వారం దగ్గర ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి తిరిగి వెళ్లిపోతుంది.

2.అడ్డంకులు, నీడలు

ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా విద్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద చెట్లు, గోడలు వంటివి ఉండకూడదు. వీటి నీడ పడడం వలన వాస్తు ప్రకారం సమస్యలు వస్తాయి. దీనిని “ద్వార వేధ” అని అంటారు. ఎదుగుదలకు ఇవి అడ్డుపడతాయి. కాబట్టి సింహద్వారం ఎదురుగా ఇలాంటివి ఉండకుండా చూసుకోండి. ఒకవేళ ఇవి ఉన్నట్లయితే ఒక చిన్న అద్దాన్ని అమర్చండి. అది దోష ప్రభావాన్ని తగ్గిస్తుంది.

3.చెప్పుల స్టాండ్

చెప్పుల స్టాండ్ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉండకూడదు. దాని వలన కూడా ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. సమస్యలు వస్తాయి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పనికిరాని షూలు, చిరిగిపోయిన చెప్పులు వంటివి ఉండకూడదు.

4.తలుపు శబ్దం రాకూడదు

ఇంటి ప్రధాన ద్వారం తలుపులు తీసేటప్పుడు, వేసేటప్పుడు శబ్దం రాకూడదు. ఒకవేళ శబ్దం వస్తున్నట్లయితే ఆ శబ్దాన్ని ఆపేలా చూసుకోండి. తలుపుల నుంచి వచ్చే శబ్దాలు ఇంట్లో కలహాలు, ఆర్థిక నష్టాలకు దారితీస్తాయి. కాబట్టి ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి.

5.గడప చాలా ముఖ్యం

పెద్దవాళ్లు గడప తొక్కకూడదని అంటారు. గడపను లక్ష్మీదేవిగా భావిస్తారు. ప్రతిరోజు ఉదయం గడపను శుభ్రం చేయండి. పసుపు, కుంకుమలతో అందంగా గడపను అలంకరించండి. అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.

ఒకవేళ సింహద్వారం దగ్గర ముళ్ల మొక్కలు ఉన్నట్లయితే ఇంట్లో ఒత్తిడి పెరిగిపోతుంది. వీటికి బదులుగా మనీ ప్లాంట్, తులసి కోట వంటివి పెట్టండి. సానుకూల మార్పులను చూడొచ్చు. అలాగే సింహద్వారం వద్ద వెలుతురు తక్కువగా ఉన్నట్లయితే ఒక ప్రకాశవంతమైన బల్బును పెట్టండి. వెలుతురు బాగా వచ్చినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

డిస్క్లైమర్: ఈ కథనంలోని సమాచారం వాస్తు శాస్త్ర నియమాలు మరియు నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఇవ్వబడింది. వీటిని పాటించే ముందు వ్యక్తిగత నమ్మకాలు, అవసరాల దృష్ట్యా నిపుణులను సంప్రదించగలరు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More