Wealth Remedies: బీరువా, పర్సులో ఇవి ఉంచితే లక్ష్మీదేవి తాండవిస్తుంది.. ఇక డబ్బే డబ్బు!
Wealth Remedies: మీ పర్సులో ఎప్పుడూ డబ్బు నిలవట్లేదా? బీరువాలో పెట్టిన సొమ్ము నీళ్లలా ఖర్చవుతోందా? అయితే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించి చూడండి. ధనాకర్షణ పెరగాలంటే బీరువా, పర్సులో ఉండాల్సిన వస్తువుల వివరాలు ఇక్కడ ఉన్నాయి. నిత్యం ఉపయోగించే పర్సులో ఏమి ఉంటే మంచిది? ఏమి ఉండకూడదు?
Wealth Remedies: ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని అనుక్షణం కష్టపడుతూ ఉంటారు. డబ్బు కోసమే అందరూ రాత్రి, పగలు శ్రమిస్తూ ఉంటారు. అయితే ఎంత కష్టపడినా నెల తిరగకముందే చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదా? అయితే ఈ పరిహారాలను ప్రయత్నం చేసి చూడండి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, సంపాదన ఒక్కటి సరిపోదు. సంపాదించిన ధనం మీతోనే ఉండాలన్నా, కొత్త ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలన్నా ధనాకర్షణ పెరిగేటట్టు చూసుకోవాలి. మనం ప్రతిరోజు ఉపయోగించే పర్సు, ఇంట్లో బీరువా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అయితే ఈరోజు పర్సులో, బీరువాలో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు వంటి విషయాలను తెలుసుకుందాం. వీటిని కనుక పాటించినట్లయితే లక్ష్మీదేవి తాండవించే అవకాశం ఉంది. డబ్బుకి లోటు కూడా ఉండదు.
నిత్యం ఉపయోగించే పర్సులో ఏమి ఉంటే మంచిది? ఏమి ఉండకూడదు?
డబ్బులు దాచుకునే పర్సు లేదా వాలెట్ అనేది కేవలం డబ్బు దాచుకోవడానికి మాత్రమే కాదు, అది లక్ష్మీదేవి నివాసం కూడా.
1.పాత బిల్లులను తొలగించండి
చాలామంది పాత బిల్లులు వంటి వాటిని అలాగే పర్సులో వదిలేస్తారు. అలాంటి అనవసరమైన కాగితాలు పర్సులో ఉంటే ప్రతికూల శక్తి పెరుగుతుంది. సానుకూల శక్తి తగ్గుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పర్సులో ఉండే ఇలాంటి కాగితాలను తొలగించాలి. లేకపోతే లక్ష్మీదేవి కూడా అక్కడ నిలవదు.
ఎర్రటి కాగితం: ఒక చిన్న ఎర్రటి కాగితంపై మీ కోరిక రాసి పెట్టండి. ఇక సానుకూల ఫలితాలను చూడొచ్చు. మంచి మార్పు వస్తుంది.
అక్షింతలు: కొన్ని అక్షింతలను చిన్న కవర్లో పెట్టి పర్సులో ఉంచండి. ఇలా చేయడం వలన అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.
యాలకులు: ఒకటి లేదా రెండు యాలకులను పర్సులో పెట్టండి. ఇది సుగంధాన్ని తీసుకురావడమే కాదు, శుక్ర గ్రహ ప్రభావంతో ధనాకర్షణ కూడా పెరగడానికి సహాయపడుతుంది.
బీరువాలో ఈ వస్తువులను పెట్టండి.. అదృష్టం, డబ్బు కలిసి వస్తాయి
బీరువాలో కొన్ని వస్తువులను పెడితే అదృష్టాన్ని పెంపొందించుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది.
బీరువా దిశ: బీరువా సరైన దిశలో ఉండాలి. ఇంటి ఉత్తర దిశలో లేదా తూర్పు వైపు పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. బీరువా తెరిచినప్పుడు అది ఉత్తరం వైపు ఉండేటట్టు చూసుకోండి. ఉత్తర దిశ కుబేరుడి దిశ. ఈ దిశలో బీరువా ఉంటే డబ్బుకి లోటు ఉండదు.
వెండి నాణెం: బీరువాలో లక్ష్మీదేవి బొమ్మ ఉండే వెండి నాణెాన్ని పెట్టండి. ఇది సంపదను పెంచుతుంది. అలాగే ప్రతిరోజు ధూపాన్ని చూపిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.
పపుసు కొమ్ములు: బీరువాలో పసుపు వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములను కట్టి పెట్టండి. విష్ణుకి, లక్ష్మీదేవికి పసుపు ఎంతో ఇష్టం. దీని వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి వీలవుతుంది.
అద్దం: బీరువాలో అద్దాన్ని పెట్టండి. అద్దం పెట్టడం వలన డబ్బు రెట్టింపు అవుతుందని, సంపద వృద్ధి చెందుతుందని నమ్మకం.
పరిమళం: బీరువాలో ఎప్పుడూ మంచి సువాసన వచ్చేటట్టు చూసుకోండి. మంచి సువాసన వచ్చే అగరబత్తులు లేదా సెంటెడ్ బాల్స్ వంటివి పెట్టండి. ఇవి కూడా సానుకూల శక్తిని తీసుకురావడానికి ఉపయోగపడతాయి.
ఈ తప్పులు చేయకుండా చూసుకోండి.
- డబ్బును ఎప్పుడూ గౌరవించాలి. ఎప్పుడూ కూడా డబ్బులను చిందరవందరగా పెట్టకండి.
- అలాగే పర్సు చిరిగిపోయినట్లయితే మార్చండి.
- శనివారం నాడు పర్సును శుభ్రం చేసుకుంటే దోషాలు తొలగిపోతాయని నమ్మకం. సంపాదనలో కొంత డబ్బును దానధర్మాలకు ఉపయోగిస్తే డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


