మకర సంక్రాంతి 2026 వేళ ఏ రాశి వారు ఏం దానం చెయ్యాలి? ఇలా చేస్తే సూర్యుని అనుగ్రహం కలుగుతుంది, దోషాలు కూడా తొలగిపోతాయి!

సంక్రాంతి పండుగ నాడు చేసే దానాలకు ఎంతో విశిష్టత ఉంది. సంక్రాంతి నాడు దానం చేస్తే చాలా పుణ్యం కలుగుతుంది. అలాగే మన రాశి ప్రకారం సంక్రాంతి నాడు కొన్ని దానాలు చేయడం వలన దోషాలన్నీ తొలగిపోతాయి, ఆనందంగా ఉండొచ్చు. మరి సంక్రాంతి నాడు వేటిని దానం చేస్తే మంచిది? ఏ రాశి వారు ఏమి దానం చెయ్యాలో చూద్దాం.

Published on: Jan 14, 2026, 15:00:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి పండుగను వరుసగా మూడు రోజులు పాటు జరుపుకుంటాము. సంక్రాంతి ముందు రోజు భోగి, సంక్రాంతి తర్వాత రోజు కనుమ పండుగలను జరుపుకుంటాము. పురాణాల ప్రకారం, సంక్రాంతి పండుగ నాడు చేసే దానాలకు ఎంతో విశిష్టత ఉంది. సంక్రాంతి నాడు దానం చేస్తే చాలా పుణ్యం కలుగుతుంది. అలాగే మన రాశి ప్రకారం సంక్రాంతి నాడు కొన్ని దానాలు చేయడం వలన దోషాలన్నీ తొలగిపోతాయి, ఆనందంగా ఉండొచ్చు. మరి సంక్రాంతి నాడు వేటిని దానం చేస్తే మంచిది? ఏ రాశి వారు ఏమి దానం చేయడం వలన పుణ్యం కలుగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.

మకర సంక్రాంతి 2026 వేళ మీ రాశి ప్రకారం వేటిని దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి (pinterest)
మకర సంక్రాంతి 2026 వేళ మీ రాశి ప్రకారం వేటిని దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి (pinterest)

మకర సంక్రాంతి 2026 వేళ మీ రాశి ప్రకారం వేటిని దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి

మేష రాశి:

మేష రాశి వారు మకర సంక్రాంతి నాడు బెల్లాన్ని దానం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. ఈ రాశి వారు బెల్లాన్ని దానం చేయడం వలన జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి.

వృషభ రాశి:

వృషభ రాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందాలన్నా, కష్టాలు తొలగిపోవాలన్నా, దోషాలు తొలగిపోవాలన్నా బియ్యాన్ని దానం చేయడం మంచిది. దీంతో చక్కటి మార్పులను చూస్తారు.

మిథున రాశి:

మిథున రాశి వారు పెసరపప్పుతో చేసిన దానం చేయడం మంచిది. దీంతో శుభ ఫలితాలను చూస్తారు, అనేక మార్పులు వస్తాయి.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారి విషయానికి వస్తే, ఈ రాశి వారు ఎంతో పుణ్యదినమైన సంక్రాంతి నాడు బియ్యం, చక్కెర, మిఠాయిలు, నువ్వులను దానం చేయడం మంచిది. దీంతో చక్కటి మార్పును చూస్తారు.

సింహ రాశి:

సింహ రాశి వారు నల్ల నువ్వులు, బెల్లం, గోధుమలు, బంగారం లేదా బంగారానికి సమానమైన ధనం వంటివి దానం చేస్తే శుభ ఫలితాలను చూస్తారు. జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. సూర్యుని అనుగ్రహం కలుగుతుంది.

కన్యా రాశి:

కన్యా రాశి వారు పెసరపప్పుతో చేసిన కిచిడిని దానం చేయడం మంచిదే. దీంతో సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. జాతకంలో దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి.

తులా రాశి:

తులా రాశి వారు తెల్లని వస్త్రాలు, చక్కెర, దుప్పట్లను దానం చేయడం వలన మంచిదే. అలాగే మకర సంక్రాంతి నాడు గంగా నది లేదా ఇతర పవిత్ర నదుల్లో స్నానం చేస్తే కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారు నల్ల నువ్వులు, బెల్లాన్ని దానం చేయడం వలన సంక్రాంతి నాడు విశేషమైన ఫలితాలను పొందవచ్చు. ఈ రాశి వారు వీటిని దానం చేయడం వలన సూర్యుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారు సూర్యుని అనుగ్రహం కలగాలన్నా, ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోవాలన్నా కుంకుమ పువ్వు దానం చేయడం మంచిది. దీంతో చక్కటి మార్పులను చూస్తారు.

మకర రాశి:

మకర రాశి వారు నూనె, నువ్వులను దానం చేయడం వలన సూర్యుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు.

కుంభ రాశి:

కుంభ రాశి వారు పేదలకు ఆహారాన్ని దానంగా ఇవ్వడం మంచిది. దీంతో చక్కటి ఫలితం కనపడుతుంది. సూర్యుని అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు.

మీన రాశి:

మీన రాశి వారు పట్టు వస్త్రాలు, నువ్వులు, పప్పులు, బియ్యం వంటి వాటిని దానం చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే సూర్యుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More