...
...
Next Story

కర్కాటకంలోకి కుజుడి సంచారం - ఈ 4 రాశుల వారికి లక్కీ టైమ్ స్టార్ట్...!

సెప్టెంబర్ 18న అంగారకుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. నవంబర్ 12 వరకు ఉండే ఈ కుజ గోచారం వల్ల మేషం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారికి కెరీర్, ఆస్తి కలసిరానున్నాయి.

Published on: Sep 19, 2026, 15:06:58 IST
By , नई दिल्ली
Prefer HTon Google
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహ మార్పుల్లో అంగారకుడి (కుజుడు) సంచారం ఒకటి. శక్తి, ధైర్యసాహసాలు, భూమి, ఆస్తి, అధికారానికి కారకుడైన కుజుడు సెప్టెంబర్ 18న కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అయితే కర్కాటకాన్ని కుజుడికి నీచ స్థానంగా (తక్కువ రాశి) పరిగణిస్తారు. అయినప్పటికీ, ప్రస్తుత గోచారంలో గురు గ్రహం (బృహస్పతి) స్థితి వల్ల కుజుడి నీచ ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు.

కర్కాటకంలోకి కుజుడి సంచారం
కర్కాటకంలోకి కుజుడి సంచారం

నవంబర్ 12 రాత్రి 8:30 నుంచి 8:45 గంటల మధ్య కుజుడు సింహరాశిలోకి ప్రవేశించే వరకు, అంటే సుమారు 56 రోజుల పాటు కర్కాటకంలోనే కొనసాగుతాడు. ఈ సమయంలో కుజ ప్రభావం వల్ల అన్ని రాశుల వారిపై విభిన్నమైన ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి కెరీర్, ఆర్థిక స్థితి, కుటుంబ పరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మేష రాశి

మేష రాశి వారికి కుజ సంచారం వల్ల ఇల్లు, కుటుంబం, భూమి మరియు ఆస్తులకు సంబంధించిన అంశాలు చురుగ్గా మారుతాయి. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు లేదా గృహ సంబంధిత పనులను పూర్తి చేయడానికి సమగ్ర ప్రణాళికలు రూపుదిద్దుకుంటాయి. ఆస్తి కొనుగోలు, వాహనాలు కొనే ఆలోచనలు సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు ఆఫీసులో కీలకమైన కొత్త బాధ్యతలు దక్కుతాయి. అయితే, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి అధిపతి కుజుడే కావడంతో ఈ రాశి వారికి ఈ సంచారం అత్యంత ప్రాధాన్యమైనది. పనిప్రాంతంలో ఉత్సాహం, వేగం పెరుగుతాయి. నిలిచిపోయిన పాత లక్ష్యాలపై మళ్లీ దృష్టి సారిస్తారు. ఉద్యోగ మార్పు లేదా కొత్త హోదాలు దక్కేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు, పనులను వేగవంతం చేసేందుకు అవకాశాలు లభిస్తాయి. అయితే ధనానికి సంబంధించిన విషయాల్లో అచితూచి వ్యవహరించాలి. పెద్ద మొత్తం పెట్టుబడులు లేదా రిస్క్ తీసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం శ్రేయస్కరం.

ధనుస్సు రాశి

మీన రాశి వారికి ఈ సమయం విద్య, సంతానం మరియు సృజనాత్మక రంగానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి సేకరించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు నూతన ప్రాజెక్టులు, ప్రణాళికలతో ముందడుగు వేస్తారు. ఆర్థికంగా మంచి అవకాశాలు లభించినప్పటికీ, తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉండాలంటే మీ అభిప్రాయాలను చెప్పడమే కాకుండా ఎదుటివారి మాటలను కూడా వినడం అలవాటు చేసుకోవాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks