పూర్వికులు చెప్పిన పురాతన పద్ధతులను ఇంకా చాలామంది పాటిస్తున్నారు. అయితే, ఎక్కువ మంది వీటిని మర్చిపోతున్నారు. క్రమంగా మర్చిపోతున్న కొన్ని సనాతన ధర్మాల గురించి రోజూ తెలుసుకుందాం.
సనాతన ధర్మాలు

సనాతన ధర్మాలను పూర్వికులు ఊరికే చెప్పలేదు. ప్రతి విషయం వెనక ఏదో ఒక కారణం దాగి ఉంటుంది. అయితే పూర్వం పాటించే ఈ నియమాలను చాలా మంది ఇప్పుడు పాటించడం మానేశారు. మరి క్రమంగా మర్చిపోతున్న కొన్ని సనాతన ధర్మాల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం.
క్రమంగా మర్చిపోతున్న కొన్ని సనాతన ధర్మాలు
- సోమవారం నాడు తలకి నూనె రాసుకోకూడదని పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఈ పొరపాటు చేయకుండా చూసుకోండి.
- అలాగే ఒంటి కాలిపై నిలబడటం మంచిది కాదు.
- శుక్రవారం నాడు కోడలిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టింటికి పంపించకూడదు. ఇది కూడా చాలా మంది మర్చిపోతున్నారు.
- మంగళవారం పుట్టింటి నుంచి కూతురిని అత్తవారింటికి పంపించడం కూడా మంచిది కాదు. ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకుని పాటించడం మంచిది.
- గుమ్మడికాయను తెచ్చుకునేటప్పుడు ముక్కలను మాత్రమే ఇంటికి తీసుకురావాలి.
- ఇంటి లోపల ఎట్టి పరిస్థితుల్లో గోళ్లను కత్తిరించుకోకూడదు.
- సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంట్లో ఉన్న చెత్తను బయట పారేయడం మంచిది కాదు.
- పెరుగు, ఉప్పును ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు.
- వేడి అన్నంలో పెరుగు వేసుకోవడం కూడా మంచిది కాదు.
- గడపను తొక్కకూడదు. గడపను దాటి మాత్రమే వెళ్లాలి.
- భోజనం మధ్యలో లేచి వెళ్లడం మంచిది కాదు.
- తల వెంట్రుకలను ఇంట్లో పడేయడం కూడా మంచిది కాదు.
- ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఇల్లు తుడిచి వెళ్లడం మంచిది కాదు. అలాగే ఎవరైనా ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఇల్లు తుడవకూడదు.
- రాత్రిపూట బట్టలు ఉతకడం మంచిది కాదు.
- విరిగిపోయిన గాజులను వేసుకోవడం కూడా మంచిది కాదు.
- గోడలకు పాదాలు ఆనించి పడుకోవడం కూడా మంచిది కాదు.
- నిద్ర లేచాక పడుకున్న చాపను లేదా దుప్పట్లను వెంటనే మడవకుండా వదిలేయకూడదు.
- చేతి గోళ్లను కొరకడం మంచిది కాదు.
- పొరపాటున కూడా అన్న తమ్ముడు, తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోవడం మంచిది కాదు.
- సూర్యాస్తమయం అయిన తర్వాత తల దువ్వుకోవడం, ఇల్లు తుడవడం వంటి పనులు చేయకూడదు.
ఐశ్వర్యం కలగాలంటే వీటిని పాటించండి
ఇంట్లో ఐశ్వర్యం కలగాలంటే ఒక కలబంద మొక్కను పెంచండి. మంగళవారం నాడు బెల్లం నీళ్లు కలబంద మొక్కకు పోస్తే చాలా మంచి జరుగుతుంది. దరిద్రం కూడా తొలగిపోతుంది.
శంకు పుష్పాల మొక్కను ఇంట్లో పెంచితే ఆ ఇల్లు దేవాలయంలా మారిపోతుంది.
సాయంత్రం పూట ఇంట్లో దీపం వెలిగిస్తే సంపద పెరుగుతుంది.
తులసి మొక్కకు నీళ్లు పోస్తే పవిత్రత పొందుతారు.
ఇంట్లో వైభవలక్ష్మి వ్రతం చేస్తే సిరిసంపదలు కలుగుతాయి.
శనివారం నాడు నూనె దీపం వెలిగిస్తే ఆనందకరమైన జీవితాన్ని గడపొచ్చు.