ఈరోజు నుంచి మార్గశిర మాసం మొదలైంది. మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి, లక్ష్మీ అనుగ్రహంతో డబ్బుకి కూడా లోటు ఉండదు. అయితే ఈసారి మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మి వారాలు వచ్చాయి, ఏ రోజు పెట్టిన నైవేద్యం పెట్టాలి, పూజా విధానంతో పాటు పూర్తి వివరాలను తెలుసుకుందాం.
మార్గశిర మాసం 2025:

నవంబర్ 21 అంటే ఈరోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమైంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలని అంటారు. మార్గశిర మాసానికి ఉన్న విశిష్టత కూడా ఇంత అంతా కాదు. “మాసానం మార్గశీర్షోహం” అన్నారు. సాక్షాత్తు వరలక్ష్మి దేవిని మార్గశిర మాసంలో వచ్చే గురువారాల నాడు ఎవరైతే పూజిస్తారో వారికి వరాలను అందిస్తుంది, వారి కోరికలన్నీ తీరుతాయి. మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయి, పూజా విధానం, నైవేద్యాలు, నియమాలు వంటి విషయాలను తెలుసుకుందాం.
లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగి వస్తుంది:
మార్గశిర మాసం నెల రోజులు కూడా లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగివచ్చి భూమిపై సంచరిస్తుందని, ఆమెను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు. శ్రావణ మాసంలో ఎలా అయితే అన్ని శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తామో, అలాగే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించాలని అంటారు. మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి, కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మి వైభవం కలుగుతుంది. అందుకే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల నాడు లక్ష్మీదేవిని నియమాలతో ఆరాధించాలి. ఈ ఐదు గురువారాలు వినియోగించుకొని లక్ష్మీదేవిని పూజించాలి.
2025 మార్గశిర మాసంలో వచ్చిన గురువారాలు
ప్రతి ఏటా ఐదు గురువారాలు వస్తాయి. నాలుగు మార్గశిర మాసంలో, ఐదవది పుష్య మాసంలో. ఈ ఐదు రోజులు కూడా లక్ష్మీదేవిని నియమాలతో పూజించాలి.
{{/usCountry}}ప్రతి ఏటా ఐదు గురువారాలు వస్తాయి. నాలుగు మార్గశిర మాసంలో, ఐదవది పుష్య మాసంలో. ఈ ఐదు రోజులు కూడా లక్ష్మీదేవిని నియమాలతో పూజించాలి.
{{/usCountry}}మొదటి గురువారం – నవంబర్ 27
రెండవ గురువారం – డిసెంబర్ 4
మూడవ గురువారం – డిసెంబర్ 11
నాలుగవ గురువారం – డిసెంబర్ 18
ఐదవ గురువారం – పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం డిసెంబర్ 25
ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి?
మొదటి గురువారం: పులగాన్ని నైవేద్యంగా
రెండవ గురువారం: అట్లు, తిమ్మనం
మూడవ గురువారం: అప్పాలు, పరమాన్నం
నాలుగవ గురువారం: చిత్రాన్నం, గారెలు
ఐదవ గురువారం: పూర్ణం బూరెలను నైవేద్యంగా పెట్టాలి
మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి?
కార్తీక మాసంలో ఎలా అయితే శివుని ఆరాధిస్తామో, మార్గశిర మాసంలో ప్రతిరోజూ లక్ష్మీదేవిని ఆరాధించాలి. ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు గురువారం నాడైనా తప్పకుండా లక్ష్మీదేవి ఎదుట దీపారాధన చేయాలి. తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా ఉంచండి. తలస్నానం చేసేటప్పుడు షాంపూ పెట్టుకోకూడదు అని గమనించండి.
లక్ష్మీదేవిని ఆరాధించాలి
ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి. ఈ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ పూలను లక్ష్మీదేవికి సమర్పిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. ఉదయం పూజ చేసే వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. పూజ పూర్తయిన తర్వాత మాత్రమే తినాలి. ముందుగా గణపతికి పూజ చేసి, ఆ తర్వాత లక్ష్మీదేవిని ఆరాధించాలి. కనకధార స్తోత్రం చదువుకుంటే మంచిది.
అలా చేయలేకపోతే “శ్రీ మహాలక్ష్మి దేవి నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. తులసమ్మను కూడా తప్పకుండా ఆరాధించి, తులసి ముందు దీపాన్ని వెలిగించండి. గురువారం పొరపాటున కూడా తలకు నూనె రాసుకోకూడదు. ప్రతి గురువారం కూడా గుమ్మాలకు పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి.
ముగ్గులో లక్ష్మీదేవి
ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ప్రతి గురువారం లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసి నమస్కరించుకోండి. కాళ్లకు నిండుగా పసుపు రాసుకుని, కుంకుమ బొట్టు పెట్టుకోండి. చేతులు నిండా మట్టి గాజులు ధరించాలి. ముత్తయిదుల్లా తయారై లక్ష్మీదేవిని ఆరాధించాలి.