Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో నిమ్మ చెట్టు ఉంటే లాభమా, నష్టమా? చాలా మంది ఇక్కడే తప్పు చేస్తున్నారు!
వాస్తు ప్రకారం పాటించడం వలన ఇబ్బందులన్నీ తొలగిపోతాయని, సానుకూల శక్తి ప్రవహించి సంతోషంగా ఉండొచ్చని నమ్మకం. ఇంటిని నిర్మించడం మొదలు ఇంట్లో పెంచే మొక్కల వరకు ఎలాంటి వాస్తు నియమాలను పాటించాలో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. నిమ్మ చెట్టు ఇంట్లో ఉంటే మంచిదేనా?
చాలామంది ఇంట్లో వాస్తు ప్రకారం నడుచుకుంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇబ్బందులన్నీ తొలగిపోతాయని, సానుకూల శక్తి ప్రవహించి సంతోషంగా ఉండొచ్చని నమ్మకం. ఇంటిని నిర్మించడం మొదలు ఇంట్లో పెంచే మొక్కల వరకు ఎలాంటి వాస్తు నియమాలను పాటించాలో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలా చేయడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి, సంతోషంగా ఉండొచ్చు.

నిమ్మ చెట్టు ఇంట్లో ఉంటే మంచిదేనా?
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో కొన్ని మొక్కలను, చెట్లను పెంచుతున్నారు. ఇంటి ఆవరణలో మొక్కలు, చెట్లు ఉంటే స్వచ్ఛమైన గాలి వస్తుంది, మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే, నిమ్మ చెట్టు ఇంట్లో పెంచవచ్చా? దాని వలన లాభమా? నష్టమా? అని అడుగుతుంటారు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో నిమ్మ చెట్టు ఉండొచ్చా? దాని వలన ఏమైనా నష్టం కలుగుతుందా? అనేది ఈరోజు తెలుసుకుందాం.
మొక్కలు, చెట్లతో ప్రశాంతం
ఇంట్లో అన్ని రకాల పండ్ల చెట్లను పెంచుకోవచ్చు. దాని వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, శుభం కలుగుతుంది. అయితే చాలా మంది నిమ్మ చెట్టు ఉండకూడదని అంటూ ఉంటారు. కానీ నిమ్మ చెట్టు వలన కూడా అనేక లాభాలు ఉన్నాయి. వాస్తు ప్రకారం నిమ్మ చెట్లు పెంచుకోవడం వలన తప్పేమీ లేదు.
ఇంట్లో నిమ్మ చెట్టు ఉండొచ్చా?
- ఇంట్లో నిమ్మ చెట్టును పెంచడం వలన ధన సంపద కలుగుతుంది, శుభం కలుగుతుంది. నిమ్మ చెట్టు శక్తిని పెంపొందిస్తుంది.
- ఇంట్లో ఈ చెట్టు ఉండడం వలన కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు, ఏ గొడవలు జరగవు. నిమ్మ చెట్టు శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తుంది.
- నిమ్మ చెట్టును ఇంట్లో తూర్పు వైపు పెంచుకుంటే మంచిది.
- నిమ్మ చెట్టుని పెంచుకుంటే జీవితంలో ఎదుగుదల ఉంటుంది, అభివృద్ధిని చూస్తారు. సిరిసంపదలు కూడా కలుగుతాయి.
- శని దోషాలు కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి నిమ్మ చెట్టు బాగా హెల్ప్ అవుతుంది. శని ప్రభావం వలన కలిగే నీరసం, ఒత్తిడి కూడా తగ్గిపోతాయి.
- ఇంట్లో నిమ్మ చెట్టును పెంచుకోవడం వలన శ్రేయస్సు కలుగుతుంది.
- వాస్తు ప్రకారం నిమ్మ చెట్టు అదృష్టాన్ని కూడా తీసుకువస్తుంది. బయట నుంచి ప్రతికూల శక్తి రాకుండా నిమ్మ చెట్టు అడ్డుకుంటుంది.
- నిమ్మ చెట్టు ఇంట్లో ఉంచితే ఉద్యోగం, వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ఆర్థిక సమస్యలు కూడా రాకుండా చూసుకోవచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


