వాస్తు ప్రకారం ఇంట్లో ఈ చెట్లు ఉంటే ఎంతో మంచి జరుగుతుంది, దిష్టి కూడా తగలదు!

ఇంటి ఆవరణలో చెట్లు ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే కొన్ని ఔషధ మొక్కలు ఉంటాయి. వాటిని ఇంట్లో పెంచడం వలన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా కొన్ని మొక్కల్లో ఉంటాయి. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణానికి ఎంపిక చేసే స్థలంలో ఎలాంటి చెట్లు ఉండాలి, అవి ఏ వైపు ఉండాలి?

Published on: Nov 18, 2025 3:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇబ్బందులు ఏమీ లేకుండా శుభ ఫలితాలను పొందవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని నిర్మించుకునే ముందు వాస్తు ప్రకారం వెంటనే నిర్మిస్తారు. ఏ దిశలో ఏముంటే మంచిది అనేది తెలుసుకుంటారు. దానిని ప్రకారం ఇల్లు కడతారు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణానికి ఎంపిక చేసే స్థలంలో ఎలాంటి చెట్లు ఉండాలి, అవి ఏ వైపు ఉండాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయాలు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.

వాస్తు ప్రకారం ఇంట్లో ఈ చెట్లు ఉంటే దిష్టి తగలదు (pinterest)
వాస్తు ప్రకారం ఇంట్లో ఈ చెట్లు ఉంటే దిష్టి తగలదు (pinterest)

ఇంటి ఆవరణలో చెట్లు ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే కొన్ని ఔషధ మొక్కలు ఉంటాయి. వాటిని ఇంట్లో పెంచడం వలన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా కొన్ని మొక్కల్లో ఉంటాయి.

తులసి

ఔషధ గుణాలు వున్న తులసిని తూర్పు, ఉత్తరం, ఈశాన్యం వైపు పెడితే మంచిది. ఇక ఇంట్లో కొన్ని మొక్కలు ఉన్నట్లయితే దిష్టి తగలదు, దిష్టి దూరం అవుతుంది. అలాగే చాలా రకాల లాభాలను కూడా పొందవచ్చు. మరి వాస్తు ప్రకారం ఏ చెట్లు ఏ దిశలో ఉంటే మంచిది? ఏ చెట్లు ఉండడం వలన దిష్టి తగలదు? వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ఇంట్లో ఈ చెట్లు ఉంటే ఎంతో మంచి జరుగుతుంది, దిష్టి కూడా తగలదు

తూర్పు వైపు

తూర్పు వైపు గంగరేగి, పనస చెట్టు ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. కాబట్టి ఇంటి తూర్పు దిశలో ఈ మొక్కలు ఉండేటట్లు చూసుకోండి. గంగరేగి దిష్టిని దూరం చేస్తుంది. సంక్రాంతి పండుగ నాడు భోగి పండ్లు పోస్తారు. పిల్లలకు దిష్టి తగలకుండా ఈ రేగి పండ్లను బంతిపువ్వుల రేకులు, చెరుకు ముక్కలు, చిల్లర కాసులతో పాటు తలపై పోస్తారు. అలాగే ఇంటి తూర్పు దిశలో పనస చెట్టు ఉంటే కూడా శుభఫలితాలు కలుగుతాయి.

ఉత్తరం వైపు

ఇంటి ఉత్తరం వైపు సంపంగి మొక్క ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. అలాగే ఉత్తరం వైపు మామిడి చెట్టు ఉంటే కూడా ఎంతో మంచి జరుగుతుంది. మామిడి చెట్టు ఇంట్లో ఉంటే నిత్య కళ్యాణం పచ్చ తోరణమే.

దక్షిణం వైపు

ఇంటి దక్షిణం వైపు వక్క చెట్టు ఉంటే శుభఫలితాలు కలుగుతాయి. అలాగే దక్షిణం వైపు చింత చెట్టు ఉంటే కూడా ఏ చింత లేకుండా సంతోషంగా ఉండొచ్చు. వక్క చెట్టు ఇంట్లో ఉండడం వలన శుభకార్యాలు, వివాహాలు జరిగి సంతోషంగా ఉండొచ్చు.

పడమర వైపు

ఇంటి పడమర వైపు రావిచెట్టు, కొబ్బరి చెట్టు ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. రావిచెట్టును విష్ణువుగా భావిస్తారు. రావిచెట్టు ఇంట్లో ఉంటే ఎప్పుడూ సంతోషానికి లోటు ఉండదు. కొబ్బరి చెట్టు కల్పవృక్షము. కొబ్బరి చెట్టును ఇంట్లో ఉంచడం వలన శుభకార్యాలు జరుగుతాయి. ఆనందంగా ఉండొచ్చు. ఇంట్లో ఏ ఇబ్బంది రాదు.