ఈ రాశుల అమ్మాయిలు ఉత్తమ కోడళ్ళు.. వీళ్ళు ఉన్న చోట ఆనందమే!

జ్యోతిషశాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఒక్కో రాశి విధంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి కొన్ని బలాలు ఉంటాయి, అయితే అవే కొన్ని రాశుల వారికి బలహీనతలు కావచ్చు. ఈ రాశుల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మాత్రం ఆ భర్త చాలా అదృష్టవంతుడు. అత్తవారింట్లో ఏ రాశుల అమ్మాయిలు ఉత్తమ కోడలుగా పేరు తెచ్చుకుంటారు?

Published on: Nov 17, 2025, 12:00:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయి అనేది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. జ్యోతిషశాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఒక్కో రాశి విధంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి కొన్ని బలాలు ఉంటాయి, అయితే అవే కొన్ని రాశుల వారికి బలహీనతలు కావచ్చు. ఈ రాశుల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మాత్రం ఆ భర్త చాలా అదృష్టవంతుడు. అత్తవారింట్లో ఏ రాశుల అమ్మాయిలు ఉత్తమ కోడలుగా పేరు తెచ్చుకుంటారు? మరి ఆ రాశుల వారు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో తెలుసుకోండి.

ఈ రాశుల అమ్మాయిలు ఉత్తమ కోడళ్ళు.. వీరు ఉన్న ఇంట్లో ఎప్పుడూ ఆనందమే (pinterest)
ఈ రాశుల అమ్మాయిలు ఉత్తమ కోడళ్ళు.. వీరు ఉన్న ఇంట్లో ఎప్పుడూ ఆనందమే (pinterest)

ప్రతి పురుషుడు కూడా ఒక మంచి భార్య జీవితంలోకి రావాలని, తన అమ్మానాన్నలను బాగా చూసుకోవాలని, మంచి కోడలుగా ఆమె పేరు తెచ్చుకోవాలని అనుకుంటారు. కుటుంబం సంతోషంగా, కలిసిమెలిసి ఉండాలంటే ఆ కోడలి పాత్ర చాలా ముఖ్యమైనది. అత్తవారి ఇల్లు ఎప్పుడు సంతోషంగా, హాయిగా ఉండాలంటే ఆ కోడలు మంచి స్వభావం కలిగి ఉండాలి.

ఆప్యాయత, సంతోషం ఉంటే కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. అయితే కొన్ని రాశుల అమ్మాయిలు మాత్రం మంచి కోడలుగా పేరు తెచ్చుకుంటారు. ఎప్పుడూ కుటుంబాన్ని బాగా అర్థం చేసుకుంటారు. కుటుంబం కలిసి మెలిసి ఉండాలని, ఆనందంగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటారు.

ఈ రాశుల అమ్మాయిలు ఉత్తమ కోడళ్ళు.. వీరు ఉన్న ఇంట్లో ఎప్పుడూ ఆనందమే

1.కన్యా రాశి

కన్యా రాశి అమ్మాయిలు చాలా తెలివైన వారు. ప్రతి విషయంలో కూడా ఎంతో శ్రద్ధ పెడతారు. సేవాగుణం కూడా ఈ రాశి వారికి ఎక్కువ. కన్యా రాశి అమ్మాయిలు ఇంటిని, కుటుంబాన్ని సరైన విధానంలో నడిపిస్తారు. కుటుంబ సభ్యుల కోసం దేనినైనా త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా తెలివిగా పరిష్కరిస్తారు. అత్తవారింట్లో ఈ రాశి అమ్మాయిలకు గౌరవం కూడా ఎక్కువ ఉంటుంది.

2.వృషభ రాశి

వృషభ రాశి అమ్మాయిలకు ఓర్పు ఎక్కువ. ఈ రాశి అమ్మాయిలు ఎప్పుడూ అత్తవారింట్లో సంతోషం ఉండాలని కోరుకుంటారు. పైగా ఈ రాశి అమ్మాయిలను గుడ్డిగా నమ్మేయొచ్చు. కుటుంబం కష్టాల్లో ఉంటే ఏమాత్రం తట్టుకోలేరు. ఇంటికి కోడలుగా వారి మద్దతు ఇస్తారు. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటారు.

3.కర్కాటక రాశి

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు ప్రేమ, ఆప్యాయత కలిగి ఉంటారు. అత్తవారింట్లో అందరూ సంతోషంగా ఉండాలని, ఎప్పుడూ ఏ ఇబ్బంది రాకుండా ఉండాలని చూసుకుంటారు. వివాహ బంధాన్ని కాపాడడంలో కూడా ఎప్పుడూ నూటికి నూరు శాతం ప్రయత్నం చేస్తారు. ఉత్తమ కోడలుగా పేరు తెచ్చుకుంటారు.

4.తులా రాశి

తులా రాశిలో పుట్టిన అమ్మాయిలు మంచితనానికి మారుపేరు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడాన్ని ఇష్టపడతారు. ఈ రాశి అమ్మాయిలు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకుంటారు. అత్తవారింట్లో ప్రశాంతత, ఆనందం ఉండాలని ఎప్పుడూ కష్టపడుతూ ఉంటారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ అందరితో కలిసి పోతూ ఉంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More