వివాహం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఒక నూతన జీవితానికి అందమైన ప్రారంభం. అయితే చాలాసార్లు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ.. వివాహ ప్రక్రియలో అడ్డంకులు ఎదురవుతాయి. పెళ్లి మండపం వరకు వచ్చి చివరి నిమిషంలో ఆగిపోవడం, పదేపదే జరిగిన వివాహ సంప్రదింపులు విఫలమవడం, జాతకాలు కలవకపోవడం వంటివి నిరాశకు దారితీస్తాయి. ఇలాంటి నిరంతర తిరస్కరణలు, వివాహ సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి హిందూమతం, జ్యోతిష్య శాస్త్రం కొన్ని పూజలు, పరిహార చర్యలను సూచించాయి. వివాహ సమస్యల నుంచి బయటపడేందుకు 5 ముఖ్యమైన పూజల ఇక్కడ ఉన్నాయి.
కుజ దోష పూజ

కుజ దోషం అనేది చాలా మంది జాతకంలో కనిపించే ఒక సాధారణ లోపం. ఇది వివాహం, భవిష్యత్ వైవాహిక జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ దోషం నుండి విముక్తి పొందడానికి కుజ బీజ మంత్రాలను జపించడం ఒక మంచి అభ్యాసం. అలాగే ఆంజనేయ స్వామిని, కార్తికేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించాలి.
కళత్ర దోష పూజ
ఒక వ్యక్తి జాతకంలో వివాహ స్థానంగా పరిగణించే ఏడో ఇంటిని ప్రభావితం చేసే ప్రతికూల, అశుభ గ్రహాలను శాంతింపజేయడానికి ఈ ప్రత్యేక పూజను నిర్వహిస్తారు. ఇది వివాహంపై శుభ గ్రహాల ప్రభావాన్ని బలపరుస్తుంది. నిర్దిష్ట మంత్ర పఠనం, దేవతలకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించడం, హోమ-హవనాల ద్వారా జాతకంలోని ప్రతికూల కర్మలను తటస్థీకరించడమే ఈ పూజ ముఖ్య ఉద్దేశ్యం.
పార్వతీ దేవి ఆరాధన
మీకు తగిన జీవిత భాగస్వామి దొరకడంలో ఆలస్యం అవుతున్నా లేదా వివాహ ఏర్పాట్లలో పదేపదే అడ్డంకులు ఎదురవుతున్నా, శివపార్వతులకు ఈ పూజ చేయడం మంచిది. పార్వతీ దేవి పవిత్ర మంత్రాలను జపించడం, అగ్నిహోత్రాలు నిర్వహించడం వంటివి చేసే ఈ పూజ అదృష్టాన్ని తెస్తుందని అంటారు.
కాలసర్వ దోష పూజ
జాతకంలో కాలసర్ప దోషం ఉన్న వ్యక్తి వివాహంలో జాప్యం జరగడం ఒక సాధారణ సమస్య. అటువంటి సందర్భంలో కాలసర్ప దోష నివారణ పూజ చేయడం వల్ల ఆ దోష తీవ్రత, దాని ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. ఇది బాధిత వ్యక్తి జాతకంలో సమతుల్యతను తీసుకువచ్చి, వారి భవిష్యత్ జీవితంలో సానుకూలతను పెంచుతుంది.
నవగ్రహ శాంతి పూజ
{{/usCountry}}జాతకంలో కాలసర్ప దోషం ఉన్న వ్యక్తి వివాహంలో జాప్యం జరగడం ఒక సాధారణ సమస్య. అటువంటి సందర్భంలో కాలసర్ప దోష నివారణ పూజ చేయడం వల్ల ఆ దోష తీవ్రత, దాని ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. ఇది బాధిత వ్యక్తి జాతకంలో సమతుల్యతను తీసుకువచ్చి, వారి భవిష్యత్ జీవితంలో సానుకూలతను పెంచుతుంది.
నవగ్రహ శాంతి పూజ
{{/usCountry}}ఒకటి కంటే ఎక్కువ గ్రహాల దుష్ప్రభావాల వల్ల వివాహానికి ఆటంకం కలుగుతుంటే.. నవగ్రహ శాంతి పూజ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పూజ ఒక వ్యక్తిలోని తొమ్మిది గ్రహాల శక్తిని సమతుల్యంగా ఉంచుతుంది. ఇది వివాహ దోషాల నుండి మాత్రమే కాకుండా.. జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల కష్టాల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ పూజను అర్హత కలిగిన పండితుని మార్గదర్శకత్వంలో చేయడం చాలా అవసరం.