గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి గ్రహాల సంచారం కారణంగా శుభ ఫలితాలు కలిగితే, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాల కదలిక మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది.

భూమికి పుత్రుడిగా, శక్తికి, సాహసానికి ప్రత్యేకంగా ఉండే అగ్నితత్వ గ్రహం కుజుడి సంచారం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. నవంబర్ 12 రాత్రి 8:06కి కుజుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు.
సింహ రాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడి రాశిలోకి కుజుడు అడుగుపెట్టడంతో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
సింహరాశిలోకి కుజుడు.. ఈ రాశుల వారికి భారీగా లాభాలు
మేష రాశి:
మేష రాశికి అధిపతి కుజుడు. ఈ సమయంలో ఈ రాశి వారు భారీగా లాభాలను పొందుతారు. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. క్లిష్టమైన నిర్ణయాలను కూడా సులువుగా తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
విద్యార్థులకు, ఉద్యోగులకు శుభ సమయం. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న టాస్కులను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
మిథున రాశి:
ఈ రాశి వారు కూడా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారికి భారీగా కలిసి వస్తుంది. లక్ష్యాలను సాధించడంలో గ్రహాల గమనం అద్భుతంగా సహకరిస్తుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది.
నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా శుభవార్తలను వింటారు. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు ప్రేమ వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సింహ రాశి:
{{/usCountry}}నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా శుభవార్తలను వింటారు. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు ప్రేమ వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సింహ రాశి:
{{/usCountry}}సింహ రాశి వారికి కూడా ఇది అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు భారీగా లాభాలను పొందుతారు. కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అద్భుతమైన అవకాశం కనబడుతోంది.
చాలా కాలంగా ప్రయాణాలు వాయిదా పడుతున్నట్లయితే, ఆకస్మిక ప్రయాణాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఉన్నవారు కార్యాలయంలో సత్తా చాటుకోవడానికి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడానికి ఇది సరైన సమయం. వ్యాపారస్తులకు కూడా ఇది శుభ సమయమని చెప్పొచ్చు.