మహాలయ అమావాస్య 9న, 10న? తేదీ, సమయం.. ఆ రోజు ఈ 6 పనులు చేస్తే విశేష ఫలితాలు!

మహాలయ అమావాస్యకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ రోజున పూర్వికులను స్మరించుకుని పితృ తర్పణం, శ్రాద్ధం, అన్నదానం, నువ్వుల దానం, వస్త్రదానం వంటి కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. 2026లో మహాలయ అమావాస్య అక్టోబర్ 10, శనివారం వచ్చింది. 

Published on: Oct 8, 2026, 12:27:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అమావాస్య తిధికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి నెలలో కూడా ఒక అమావాస్య వస్తుంది. అమావాస్య అంటే పూర్వికులను స్మరించుకుని తర్పణాలు సమర్పించడం, అన్నదానాలు చేయడం, వస్త్రదానాలు చేయడం.. ఇలా ఎవరికి నచ్చిన వాటిని వారు అనుసరిస్తూ ఉంటారు. అయితే, ఎప్పుడూ వచ్చే ఈ మహాలయ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది.

మహాలయ అమావాస్య 9న, 10న? తేదీ, సమయం.. ఆ రోజు ఈ 6 పనులు చేస్తే విశేష ఫలితాలు! (AI)
మహాలయ అమావాస్య 9న, 10న? తేదీ, సమయం.. ఆ రోజు ఈ 6 పనులు చేస్తే విశేష ఫలితాలు! (AI)

మహాలయ అమావాస్య నాడు చాలా మంది పూర్వికులను తలుచుకుని మంచి పనులు చేస్తూ ఉంటారు. నిజానికి, మహాలయ అమావాస్యను సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే విశేషమైన ఫలితాలను పొందవచ్చు. ఇంతకీ ఈ మహాలయ అమావాస్య ఎప్పుడు వచ్చింది? తేదీతో, సమయంతో పాటుగా ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు, పాటించాల్సిన పరిహారాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం.

మహాలయ అమావాస్య 2026 ఎప్పుడు వచ్చింది?

2026లో మహాలయ అమావాస్య శనివారం, అక్టోబర్ 10న వచ్చింది. అమావాస్య తిథి అక్టోబర్ 9 రాత్రి సుమారు 9:36 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 10 రాత్రి 9:19 గంటలకు ముగుస్తుంది. ఈ లెక్కన చూస్తే అక్టోబర్ 10న శనివారం నాడు మహాలయ అమావాస్యను జరుపుకోవాలని, పితృ కార్యాలకు ఇది అనువైన రోజు.

పితృ తర్పణం, శ్రార్ధ కార్యక్రమాలను అపరాహ్న సమయంలో, అంటే మధ్యాహ్నం సుమారు 1:14 నుంచి 3:36 గంటల మధ్య చేస్తే అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సంప్రదాయం, ప్రాంతీయ పంచాంగం ప్రకారం కాస్త ఆ సమయాల్లో మార్పులు ఉండొచ్చు.

మహాలయ అమావాస్య రోజు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు

1.నువ్వుల దానం:

నువ్వుల దానం చేస్తే చాలా మంచిది. అలాగే ధాన్యం కూడా ఈ మహాలయ అమావాస్య నాడు దానం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

2.పితృ తర్పణం:

నువ్వులు కలిపిన నీటిని పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణంగా సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి పితృ తర్పణాలు కూడా చేయండి.

3.అన్నదానం:

అవసరమైన వారికి అన్నదానం చేస్తే కూడా విశేషమైన ఫలితాలను పొందవచ్చు. అన్నదానాల కంటే అన్నదానం అనేది చాలా మంచిది. అలాగే పండ్లు, ధాన్యం, ఇతర ఆహార పదార్థాలను కూడా మహాలయ అమావాస్య నాడు దానం చేస్తే మంచిదే.

4.కాకులకు, గోవులకు ఆహారం:

మహాలయ అమావాస్య నాడు కాకులకు, గోవులకు కూడా ఆహారాన్ని అందించడం శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది. కనుక కుదిరితే వీటికి ఆహారాన్ని అందించండి.

5.వస్త్ర దానం:

మహాలయ అమావాస్య నాడు వస్త్రదానం చేయడం కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. కనుక ఆ రోజు వస్త్రదానం చేస్తే కూడా మంచిది.

6.పూర్వికుల స్మరణ:

ఇంట్లో దీపం వెలిగించి పూర్వికులను భక్తిశ్రద్ధలతో స్మరించుకోండి. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించండి. ఇది కూడా చాలా మంచి అలవాటు.

శ్రాద్ధం, పిండప్రదానం వంటి కర్మలను మీ కుటుంబ ఆచారాల ప్రకారం, పురోహితుల సూచనల మేరకు చేయండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More