వైదిక జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రతి గ్రహం రాశి మారినప్పుడు మానవ జీవితాలపై, దేశ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గ్రహాల సేనాపతి అయిన కుజుడు శక్తి, సాహసం, పరాక్రమం మరియు నాయకత్వ లక్షణాలకు కారకుడిగా భావిస్తారు. వచ్చే నవంబర్ 12, 2026 నాడు కుజుడు సూర్యుడికి చెందిన సింహరాశిలోకి అడుగుపెట్టబోతున్నారు. 2027 మార్చి 9 వరకు కుజుడు ఇదే రాశిలో సంచరిస్తారు.

కుజుడు మరియు సింహరాశి రెండూ కూడా అగ్ని తత్వానికి ప్రతీకలు కావడంతో ఈ కలయిక అసాధారణ శక్తిని ఇస్తుంది. జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ప్రకారం, కుజుడికి సూర్యుడితో స్నేహ భావం ఉండటం వల్ల ఈ గోచార ప్రభావం చాలా రాశులపై సానుకూలంగా ఉండనుంది.
ముఖ్యంగా నలుగురిలో ప్రత్యేక గుర్తింపును కోరుకునే వారికి, నాయకత్వ బాధ్యతలు నిర్వహించే వారికి ఈ కాలం స్వర్ణయుగమనే చెప్పాలి. సింహరాశిలో కుజుడి సంచారం వల్ల ఏయే రాశుల వారి జాతకం మలుపు తిరగనుందో ఇక్కడ పరిశీలిద్దాం.
మేష రాశి:
మేష రాశికి కుజుడే అధిపతి. ఈ రాశి వారికి పంచమ భావంలో కుజుడి సంచారం జరుగుతుండటంతో శుభ ఫలితాలు వెల్లువెత్తుతాయి. ఇన్నాళ్లుగా పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు అందుకోవడంతో పాటు, ఇష్టమైన ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశం లభిస్తుంది. జీవితంలో కీలకమైన స్వప్నాలను సాకారం చేసుకునే సమయం ఆసన్నమైంది.
సింహ రాశి:
సింహరాశిలోనే కుజుడు లగ్న భావంలో సంచరించబోతుండటం ఈ రాశి వారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఇన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు లేదా ఉన్నత పదవుల బాధ్యతలు మీ సొంతమవుతాయి.
కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు శుభవార్త మెండుగా ఉంది. కార్యాలయంలో మీ నాయకత్వ లక్షణాలను అందరూ కొనియాడుతారు. కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించడంతో పాటు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
వృశ్చిక రాశి:
{{/usCountry}}కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు శుభవార్త మెండుగా ఉంది. కార్యాలయంలో మీ నాయకత్వ లక్షణాలను అందరూ కొనియాడుతారు. కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించడంతో పాటు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
వృశ్చిక రాశి:
{{/usCountry}}వృశ్చిక రాశికి కూడా కుజుడే అధిపతి కావడంతో ఈ గోచారం ఈ రాశివారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అనుకున్న లక్ష్యాలను ఎలాంటి అడ్డంకులు లేకుండా సులువుగా సాధిస్తారు.
కార్యాలయంలో మీ సత్తా నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్థిరాస్తులు, భూములు, సొంతిల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనే కల నెరవేరే సూచనలు స్పష్టంగా ఉన్నాయి.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఈ కాలం అనూహ్యమైన అవకాశాలను తెచ్చిపెడుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు శుభవార్తలు వినే అవకాశం ఉంది.
ఉద్యోగ మార్పును కోరుకునే వారికి ఇది సరైన సమయం. సరైన ప్రణాళికతో చేసే పెట్టుబడులు భవిష్యత్తులో భారీ లాభాలను అందిస్తాయి. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.