...
...
Next Story

మిథునంలోకి కుజుడు... రాహువుతో ముఖాముఖి - ఈ 5 రాశుల వారికి లక్కీ టైమ్, పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్

మిథున రాశిలోకి అంగారకుడి సంచారంతో రాహువుతో ముఖాముఖి స్థితి ఏర్పడింది. సెప్టెంబర్ 18, 2026 వరకు కొనసాగే ఈ ప్రత్యేక మంగళ-రాహు ప్రభావం వల్ల ఏ ఏ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, వృత్తిలో పురోగతి ఉండనుంది.

Published on: Aug 3, 2026, 09:53:58 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహ మార్పు సంభవించింది. నవగ్రహాల అధిపతి, ధైర్యసాహసాలకు సంకేతమైన అంగారక గ్రహం (కుజుడు) ఆగస్టు 2న మిథున రాశిలోకి ప్రవేశించాడు. రాబోయే సెప్టెంబర్ 18, 2026 వరకు అంగారకుడు ఈ రాశిలోనే కొనసాగుతాడు. ఈ సంచారం కారణంగా జ్యోతిష్య చక్రంలో అంగారకుడు, రాహువు ఒకరికొకరు ముఖాముఖి నిలిచే ప్రత్యేక స్థితి ఏర్పడింది.

మిథునంలో అంగారకుడు
మిథునంలో అంగారకుడు

జ్యోతిష్య గణనాల ప్రకారం రాహు-మంగళ గ్రహాల ముఖాముఖి ఘర్షణను అత్యంత ప్రభావవంతమైన సంఘటనగా భావిస్తారు. అంగారకుడు క్రోధం, పట్టుదల, శక్తి మరియు పరాక్రమానికి ప్రతీక అయితే…. రాహువు భ్రమలు, ఊహించని పరిణామాలు, ఆకస్మిక మార్పులకు సూచిక.

ఈ రెండు శక్తుల కలయిక వల్ల కొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సి రాగా, మరికొన్ని రాశుల వారికి మాత్రం పట్టెడంత అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ సంచార కాలంలో ఆకస్మిక ధన ప్రవాహం, ఉద్యోగంలో పదోన్నతులు, కెరీర్‌లో కొత్త శిఖరాలను అందుకోబోయే ఆ 5 అదృష్ట రాశుల వివరాలు ఇవే……

1. మేష రాశి

మేష రాశి వారికి అంగారకుడి స్థానచలనం అత్యంత శుభప్రదమైన మార్పులను తెస్తుంది. ఈ సమయంలో మీ ఆర్థికంగా స్థిరపడి, ఎంతో బలంగా మారుతుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. అదృష్టం మీ వెంటే ఉండటంతో ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు తెరచుకోవడమే కాకుండా, పాత మార్గాల ద్వారా కూడా నిధులు సమకూరుతాయి.

2. సింహ రాశి

సింహ రాశి వారికి ఈ సమయం ఎంతో ఉపశమనాన్ని, సంతోషాన్ని అందిస్తుంది. ఉద్యోగ సంబంధిత ఒత్తిళ్లు, ఇబ్బందులు నశిస్తాయి. వృత్తి జీవితంలో మీరు ఆశించిన అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. ఆగిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు సూచిస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.

3. కన్యా రాశి

వృశ్చిక రాశి అధిపతి అంగారకుడే కావడం వల్ల ఈ గ్రహ మార్పు అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది. రావాల్సిన పాత బాకీలు, ఇరుక్కుపోయిన సొమ్ము తిరిగి మీ చేతికి అందుతుంది. వ్యాపారవేత్తలు పెద్ద డీల్స్ లేదా కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు, ఇది లాభాలను పెంచుతుంది. సమాజంలో గల పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.

5. మకర రాశి

మకర రాశి వారికి ఈ సంచార కాలం చాలా ప్రత్యేకమైనది. పనిప్రాంతంలో మీ ప్రతిభకు తగిన గురింపు లభిస్తుంది. ధన ప్రవాహం పెరిగి కొత్త రాబడి మార్గాలు సుగమమవుతాయి. భౌతిక సుఖసంతోషాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. పని ప్రదేశంలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఇల్లు, భూమి లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks