Mars Transit: కుజుని అనుగ్రహంతో ఈ 4 రాశుల వారు ధనవంతులు అవుతారు.. విజయాలు, అనందం కూడా వీరితోనే!
కుజుడు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. జీవితంలో అనేక మార్పులను తీసుకు వస్తుంది. డిసెంబర్ 2025లో కుజుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ' ఇది కొన్ని రాశులు వారి జీవితాల్లో అద్భుతాన్ని తీసుకొస్తుంది. సమాజంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో ఈ రాశుల వారు ఆనందంగా ఉంటారు.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది శుభ యోగాలను, అశుభ యోగాలను తీసుకు వస్తుంది. కుజుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. జీవితంలో అనేక మార్పులను తీసుకు వస్తుంది. డిసెంబర్ 2025లో కుజుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. '

ఇది కొన్ని రాశులు వారి జీవితాల్లో అద్భుతాన్ని తీసుకొస్తుంది. సమాజంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో ఈ రాశుల వారు ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా వస్తాయి. మరి అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
ధనస్సు రాశిలో కుజుడు
కుజుడు ధైర్యం, శక్తి, భూమి మొదలైన వాటికి కారకుడు. కుజుడు ధనస్సు రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. ధనస్సు రాశికి అధిపతి గురువు. డిసెంబర్ 7, ఆదివారం రాత్రి 7:26కి కుజుడు ధనస్సు రాశిలోకి అడుగుపెడతాడు. దీంతో నాలుగు రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయి.
1.మేష రాశి
మేష రాశి వారికి కుజుని రాశి మార్పు శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామి సపోర్ట్ ఉంటుంది. శత్రువుల బాధల నుంచి బయటపడతారు.
2.మిధున రాశి
మిధున రాశి వారికి ఈ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఎక్కువ లాభాలను పొందుతారు. శత్రువుల బాధలు తొలగిపోతాయి. కెరీర్‌లో మంచి మార్పులు చూస్తారు. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది.
3.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఈ సంచారం ద్వారా ఎక్కువ లాభాలను పొందుతారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెళ్లి కుదిరే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా వస్తాయి. ఆర్థికపరంగా బావుంటుంది. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి.
4.ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ సంచారం మంచి ప్రయోజనాలను అందిస్తుంది. విజయాలను అందుకుంటారు. సంతోషంగా ఉండొచ్చు. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. సక్సెస్‌ను అందుకుంటారు. సమాజంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


