2026లో ఈ రాశులకు అపారమైన సంపద, కీర్తి.. శని సంచారంతో జీవితమే మారిపోతుంది!
గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. 2026లో శని సంవత్సరం అంతా కూడా మీన రాశిలో సంచారం చేస్తాడు. ఇలా మీన రాశిలో శని సంచారం చేయడంతో కొన్ని రాశుల వరకే అద్భుతంగా కలిసి వస్తుంది. శని సంచారం వలన ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుందో తెలుసుకుందాం.
గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. 2026లో శని సంవత్సరం అంతా కూడా మీన రాశిలో సంచారం చేస్తాడు. ఇలా మీన రాశిలో శని సంచారం చేయడంతో కొన్ని రాశుల వరకే అద్భుతంగా కలిసి వస్తుంది. శని సంచారం వలన ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుందో, ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారో ఈ రోజు తెలుసుకుందాం.

2026లో మీన రాశిలో శని సంచారం
శని దేవుడు మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి వాటికి మంచి ఫలితాలను, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను అందిస్తాడు. 2026లో శని మీన రాశిలో సంచారం చేస్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.
మీన రాశిలో శని సంచారం, ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి శని సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు. సమాజంలో పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం ఎక్కువవుతుంది. శత్రువుల నుంచి సమస్యలు తొలగిపోతాయి. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీకు రావాల్సిన ఫలితాలు అన్నీ వస్తాయి.
2.మిధున రాశి:
మిధున రాశి వారికి శని సంచారం బాగా కలిసి వస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మీ కలలు కూడా నెరవేరుతాయి.
3.తులా రాశి:
తులా రాశి వారికి శని సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. కెరీర్‌లో, వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలను పొందుతారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం.
4.మీన రాశి:
మీన రాశి వారికి శని సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. అడ్డంకులు తొలగిపోతాయి. ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. మీ భాగస్వామితో ఆనందంగా ఉంటారు. ప్రేమ పెరుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


