నవంబర్ 30న శుక్ర, వరుణుల సంయోగంతో శక్తివంతమైన నవపంచమ యోగం, మూడు రాశుల వారి జీవితంలో వెలుగులు.. డబ్బు, అనందం ఇలా ఎన్నో

కొన్ని సార్లు గ్రహాల కారణంగా ఏర్పడిన శుభ యోగాలు అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తూ ఉంటాయి. దాంతో జీవితమే మారిపోతుంది, అనుకోని విషయాలు జరుగుతాయి. నవంబర్ 30న, అంటే మరో రెండు రోజుల్లో, శుక్రవారం ఈ యోగం ఏర్పడబోతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తుంది. 

Published on: Nov 28, 2025, 09:20:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాలు రాశి మార్పు చేసినపుడు శుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సార్లు గ్రహాల కారణంగా ఏర్పడిన శుభ యోగాలు అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తూ ఉంటాయి. దాంతో జీవితమే మారిపోతుంది, అనుకోని విషయాలు జరుగుతాయి.

శుక్ర, వరుణ సంయోగం.. ఈ రాశుల వారికి అద్భుతమైన లాభాలు
శుక్ర, వరుణ సంయోగం.. ఈ రాశుల వారికి అద్భుతమైన లాభాలు

శుక్ర, వరుణ సంయోగం

శుక్రుడు సంపద, డబ్బు, విలాసాలకు కారకుడు. శుక్రుడు త్వరలో నవ పంచమ యోగాన్ని ఏర్పరచబోతున్నాడు. నవంబర్ 30న, అంటే మరో రెండు రోజుల్లో, శుక్రవారం ఈ యోగం ఏర్పడబోతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ప్రేమ జీవితంలో ఆనందం, ప్రశాంతత ఉంటాయి. జీవితంలో సానుకూల మార్పులు చూస్తారు. ప్రేమ జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా సాగుతారు. ముఖ్యంగా ఆ మూడు రాశుల వారికి ఇది అనేక విధాలుగా లాభాలు తీసుకురాబోతుంది. మరి అదృష్ట రాశులు ఎవరు? వారిలో మీరు ఒకరేమో చూసుకోండి.

శుక్ర, వరుణ సంయోగం.. ఈ రాశుల వారికి అద్భుతమైన లాభాలు

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ యోగం అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తుంది. నవ పంచమ రాజయోగంతో వృషభ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. వైవాహిక జీవితంలో ఆనందం సాగుతుంది. మీరు ప్రణాళిక వేసుకున్న దాని ప్రకారం పనులను పూర్తి చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. జీవితంలో సానుకూల మార్పులు చూస్తారు. ఒంటరిగా ఉన్నవారు ప్రేమ జీవితంలో ఆనందాన్ని పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.

2.మీన రాశి

మీన రాశి వారికి ఈ అవకాశం బాగా కలిసి వస్తుంది. శుక్రుడు–వరుణుడి అనుగ్రహంతో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆనందం పెరుగుతుంది. ఆదాయం ఎక్కువవుతుంది. కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంటుంది. కెరీర్‌లో మంచి మార్పులు చూస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రేమ జీవితంలో ఆనందం, ప్రశాంతత ఉంటాయి.

3.తులా రాశి

తులా రాశి వారికి నవ పంచమ రాజయోగం అద్భుతమైన లాభాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పని ప్రదేశంలో చక్కటి మార్పులు చూస్తారు.

ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే కొంచెం ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా సాగుతారు. ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More