అమావాస్య తిథికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి అమావాస్యనాడు చాలామంది రకరకాల పరిహారాలను పాటించడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 18, ఆదివారం నాడు వచ్చింది. ఈ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం చూస్తే ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మౌని అంటే మౌనంగా ఉండడం అని అర్థం. అందుకే అమావాస్య నాడు చాలా మంది మౌన దీక్షను పాటిస్తారు. అలాగే ఈ మౌని అమావాస్య నాడు నదీ స్నానం చేయడం, దానధర్మాలు చేయడం వంటివి ఎంతో శుభప్రదమైన ఫలితాలను తీసుకువస్తాయి.
మౌని అమావాస్య 2026

ఈ మౌని అమావాస్య అనేది మహాశివరాత్రి పండుగకు ముందు వస్తుంది. దీంతో సాధువులు, యోగ సాధకులు మౌని అమావాస్యను చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమమైన త్రివేణి సంగమంలో స్నానం చేస్తారు.
మౌని అమావాస్య తేదీ, శుభ ముహూర్తం
మౌని అమావాస్య జనవరి 18, ఆదివారం నాడు వచ్చింది. ఆ రోజు అనగా జనవరి 18 తెల్లవారుజామున 12:03కి అమావాస్య తిథి మొదలవుతుంది. తర్వాత రోజు అంటే జనవరి 19, 01:21తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి. కనుక మౌని అమావాస్యను జనవరి 18న జరుపుకోవాలి.
ఆ రోజు బ్రహ్మ ముహూర్తంలో, అంటే ఉదయం 5:27 నుంచి ఉదయం 6:21 మధ్య స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అమావాస్య నాడు చంద్రుడు దర్శనం ఇవ్వడు. మౌని అమావాస్య నాడు కూడా చంద్రుడు దర్శనం ఉండదు కనుక ఆ అమావాస్య నాడు కీలక నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉండవు. మౌని అమావాస్యనాడు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
మౌని అమావాస్య నాడు వీటిని పాటించడం మంచిది
అమావాస్య నాడు రుద్రాక్ష మాలను ధరిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.
{{/usCountry}}అమావాస్య నాడు రుద్రాక్ష మాలను ధరిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.
{{/usCountry}}నువ్వుల నూనెతో లేదా నువ్వులతో శనీశ్వరుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది.
మౌని అమావాస్య నాడు పూర్తిగా మౌనం పాటించడం మంచిదని అంటారు. అందుకే మౌని అమావాస్య నాడు అందరూ మౌనంగా ఉంటారు. అలా చేయడం వలన అంతఃశుద్ధీకరణ జరుగుతుంది.
అలాగే గంగా నదిలో లేదా త్రివేణి సంగమంలో ఆ రోజు నీరు అమృతంతో సమానం అని అంటారు. అందుకని ఆ రోజున పుణ్యస్నానం చేస్తారు.
నాగసాధువులులో చేరే వారికి కూడా అది పవిత్రమైన రోజు అని నమ్ముతారు.
రావి చెట్టు నీడలో మౌని అమావాస్య నాడు దీపాలను వెలిగిస్తే చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు.
పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టడం కూడా శుభ ఫలితాలను తీసుకువస్తుంది.