తులా రాశిలో బుధుడి తిరోగమనం.. ఈ 5 రాశులకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ధనకారకుడైన శుక్రుడితో కలిసి తులా రాశిలో సంచరిస్తున్న బుధుడు నవంబర్ 13, 2026 వరకు వక్రగతిలో కొనసాగనున్నాడు. బుధుడి తిరోగమన ప్రభావంతో ఆలోచనలు, నిర్ణయాలు, వ్యాపారం, ఆర్థిక లావాదేవీల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Published on: Nov 4, 2026, 14:00:47 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మానవ జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా గ్రహాల రాకుమారుడిగా భావించే బుధుడు తిరోగమనం చెందుతాడు. మానసిక స్థితిగతులు, వ్యాపారం, ఆర్థిక లావాదేవీలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ధనకారకుడైన శుక్రుడితో కలిసి తులా రాశిలో ఉన్న బుధుడు వక్రీభవనంలో పయనిస్తున్నాడు.

తులా రాశిలో బుధుడి తిరోగమనం.. ఈ 5 రాశులకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు!
తులా రాశిలో బుధుడి తిరోగమనం.. ఈ 5 రాశులకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు!

హిందూ పంచాంగం ప్రకారం, ఈ నవంబర్ 13, 2026 వరకు బుధుడు ఇదే వక్రగతిలో కొనసాగనున్నాడు. బుధుడు వెనక్కి నడిచే ఈ సమయంలో సాధారణంగానే నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు మధ్య గందరగోళం ఏర్పడతాయి. ఈ వక్రబుధ సంచారం ఐదు ప్రధాన రాశుల వారికి సవాళ్లతో కూడుకున్న సమయంగా మారనుంది. రాబోయే పది రోజుల పాటు ఈ రాశుల వారు అడుగులో అడుగు వేసి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఏయే రాశులపై వక్రబుధ ప్రభావం ఎలా ఉంటుంది?

వృషభ రాశి:

వృషభ రాశి వారికి ప్రస్తుత వక్ర బుధ సంచారం అనుకూల ఫలితాలను ఇవ్వదు. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి మనస్పర్థలు, అనవసరమైన విషయాలపై చర్చలు రావడం వల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది. మరోవైపు, చేతిలో డబ్బు నిలవకుండా అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో బడ్జెట్ నియంత్రణ చాలా ముఖ్యం.

మిథున రాశి:

మిథున రాశి వారికి ఈ సంచార కాలం సవాళ్లను తెస్తోంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా భావాలను వ్యక్తపరిచేటప్పుడు తీవ్ర అప్రమత్తత అవసరం. మీ మాటలను అవతలివారు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ప్రేమ జీవితంలో భాగస్వామితో చిన్నపాటి పొరపొచ్చాలు పెరిగే సూచనలున్నాయి.

కన్యా రాశి:

వ్యాపార రంగంలో ఉన్న కన్యా రాశి వారికి ఈ పది రోజులు పరీక్షాకాలమేనని చెప్పాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు లెక్కల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం. మనసులో గందరగోళం మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు.

తులా రాశి:

బుధుడు నేరుగా మీ స్వరాశిలోనే వక్రీభవనం చెందుతుండటంతో తులా రాశి వారికి ఈ కాలం మరింత గడ్డుగా మారనుంది. జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే, తొందరపాటు పడకండి. ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు సాగితేనే నష్టాల నుండి బయటపడవచ్చు.

కుంభ రాశి:

కుంభ రాశి ఉద్యోగులకు కార్యక్షేత్రంలో అదనపు పనిభారం మోయాల్సిన పరిస్థితి వస్తుంది. పై అధికారుల నుంచి వత్తిడి పెరిగే ఛాన్స్ ఉంది. ఆర్థిక లావాదేవీలు లేదా అప్పుల చెల్లింపుల్లో అనుకోని జాప్యం ఏర్పడవచ్చు. కాబట్టి ప్రశాంతతను కోల్పోకుండా ఓపికగా వ్యవహరించడం చాలా అవసరం.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More