సింహరాశిలోకి బుధుడి సంచారం - బుధాదిత్య రాజయోగంతో ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం!
మరికొద్ది రోజుల్లో బుధ గ్రహం సింహరాశిలోకి ప్రవేశించనుంది. సూర్యుడితో కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరచనున్న ఈ సంచారంతో పలు రాశుల వారికి జాబ్ ప్రమోషన్లు, ఆర్థిక లాభాలను పొందుతారు.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యువరాజుగా భావించే బుధుడు త్వరలోనే తన మార్గాన్ని, వేగాన్ని మార్చుకోబోతున్నాడు. జాతకంలో బుధుడి స్థానం అనుకూలంగా, బలపడి ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. చురుకైన తెలివితేటలు, వ్యాపారంలో అపారమైన విజయాలు, సంపద, లౌక్యం బుధుడి అనుగ్రహంతోనే లభిస్తాయి. త్వరలో రాబోయే చంద్రగ్రహణానికి ముందే బుధుడు తన రాశిని మార్చుకోబోతుండటం విశేషం.

ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న బుధుడు, హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 22, 2026న సూర్యుడికి స్వక్షేత్రమైన సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే సింహరాశిలో గ్రహాల రాజు సూర్యుడు కొలువై ఉన్నాడు. ఇప్పుడు అదే రాశిలోకి బుధుడు కూడా అడుగుపెడుతుండటంతో అత్యంత శక్తివంతమైన 'బుధాదిత్య రాజయోగం' రూపుదిద్దుకోనుంది. ఈ అరుదైన యోగం కారణంగా సరిగ్గా నాలుగు రోజుల తర్వాత కొన్ని రాశుల వారి జాతకం పూర్తిగా మారబోతోంది. వీరికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు, ఆకస్మిక ధన లాభాలు కలగనున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
సింహ రాశి :
బుధుడి సంచారం సింహ రాశి వారికి అత్యంత లాభదాయకంగా ఉండబోతోంది. స్వక్షేత్రంలోనే ఈ యోగం ఏర్పడుతుండటంతో మీ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు దక్కడంతో పాటు సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీపై కుట్రలు చేసే ప్రత్యర్థులు కూడా మీ ముందు తలవంచక తప్పదు, వారు మీకు ఎలాంటి హానీ చేయలేరు. వీలైనంత ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.
ధనుస్సు రాశి :
ధనుస్సు రాశి వారికి బుధుడి మార్పు అద్భుతమైన ప్రయోజనాలను మోసుకొస్తోంది. ఉద్యోగాల్లో ఉన్నవారు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక కొత్త మార్గాలను అన్వేషిస్తారు, అందులో విజయం సాధిస్తారు. వ్యాపారంలో మీరు వేసే ప్రణాళికలు, వ్యూహాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. లాభాలు ఊహించని స్థాయిలో ఉంటాయి. అయితే మీ ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.
కన్యా రాశి :
కన్యా రాశి అధిపతి అయిన బుధుడు సింహరాశిలోకి మారడం ఈ రాశి వారికి చాలా సానుకూల మార్పులను తెస్తుంది. చాన్నాళ్ల తర్వాత ఒక పాత స్నేహితుడిని కలవడం వల్ల మీ మనసు ఆనందంతో నిండిపోతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు కోరుకున్న తీపి కబురు అందుతుంది. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.
వృశ్చిక రాశి :
వృశ్చిక రాశి వారికి ఈ బుధ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు, చెడిపోయిన వ్యవహారాలు మళ్లీ వేగవంతమై పూర్తి అవుతాయి. ప్రయాణాలకు సంబంధించి బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వారికి వ్యాపారాన్ని విస్తరించేందుకు మంచి పెట్టుబడిదారులు దొరుకుతారు. దీనివల్ల వ్యాపారంలో కొత్త శిఖరాలను చేరుకుంటారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

