...
...
Next Story

బుధ సంచారంతో పన్నెండు రాశులపై ప్రభావం.. ఈ రాశుల వారికి అదృష్టం.. ‘రాజకుమారుడి’ రాశి మార్పుతో మీ జాతకం ఎలా ఉందంటే?

జ్యోతిష్య శాస్త్రంలో బుద్ధి, వాక్చాతుర్యానికి కారకుడైన బుధుడు మే 15న రాశి పరివర్తనం చెందబోతున్నాడు. మేషం నుంచి వృషభ రాశిలోకి బుధుడి ప్రవేశం వల్ల 12 రాశుల వారి ఆలోచనా విధానంలో, ఆర్థిక స్థితిగతుల్లో కీలక మార్పులు రానున్నాయి. ఎవరికి లాభం? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? పూర్తి వివరాలు ఇవే.

Published on: May 5, 2026, 15:00:41 IST
Advertisement

నవగ్రహాలలో బుధుడిని 'రాజకుమారుడు' అని పిలుస్తారు. మన ఆలోచనా తీరు, తెలివితేటలు, మాట్లాడే విధానం అంతా బుధుడి ప్రభావం పైనే ఆధారపడి ఉంటుంది. బుధుడు జాతకంలో బలంగా ఉంటే ఆ వ్యక్తి ఏ విషయాన్నైనా త్వరగా గ్రహిస్తాడు, స్పష్టంగా మాట్లాడతాడు. అదే బుధుడు బలహీనంగా ఉంటే నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, గందరగోళం ఎదురవుతాయి. 2026 మే 15వ తేదీ అర్ధరాత్రి 12:18 గంటలకు బుధుడు మేష రాశిని వదిలి వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ మార్పు వల్ల ద్వాదశ రాశుల వారిపై పడే ప్రభావం ఇలా ఉంది.

వృషభ రాశిలోకి బుధుడు.. ద్వాదశ రాశుల ఫలితాలు ఇవిగో

మేష రాశి:

బుధ సంచారంతో పన్నెండు రాశులపై ప్రభావం (pinterest)
బుధ సంచారంతో పన్నెండు రాశులపై ప్రభావం (pinterest)

పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ పాత పనులు పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు వద్దు. మాట తీరు వల్ల మనస్పర్థలు రాకుండా చూసుకోండి.

వృషభ రాశి:

ఓపిక పట్టాల్సిన సమయం. ఆఫీసులో పై అధికారుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబంతో గడిపే సమయం మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

మిథున రాశి:

కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి.

కర్కాటక రాశి:

మీరు కాస్త భావోద్వేగానికి లోనయ్యే అవకాశం ఉంది. పనిపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. పాత స్నేహితులను కలవడం వల్ల మనసు తేలికపడుతుంది.

సింహ రాశి:

మీకు చాలా సానుకూల కాలం. ఆఫీసులో ప్రశంసలు దక్కుతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, ప్రేమ జీవితంలో సాఫీగా సాగుతుంది.

కన్యా రాశి:

రాశి వారు కాస్త అప్రమత్తంగా ఉండాలి. చిన్న తప్పులు పెద్దవి కావచ్చు. అనవసర వాదనలకు దూరంగా ఉండండి, ఖర్చులు నియంత్రించండి.

తులా రాశి:

జీవితం సమతుల్యంగా సాగుతుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది, బంధాల్లో నమ్మకం పెరుగుతుంది.

వృశ్చిక రాశి:

కొత్త బాధ్యతలు, అవకాశాలు తలుపు తడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

మకర రాశి:

పెండింగ్‌లో ఉన్న పనులపై దృష్టి పెట్టండి. ఖర్చులు పెరగవచ్చు. కుటుంబ విషయాల్లో ఓపికగా వ్యవహరించడం ఉత్తమం.

కుంభ రాశి:

ఇది మీకు మంచి కాలం నడుస్తోంది. కెరీర్‌లో ముందుకు వెళ్లే అవకాశాలు వస్తాయి. కొత్త ప్రణాళికలు విజయవంతం అవుతాయి.

మీన రాశి:

తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని మిగిలిస్తాయి. పనులు నెమ్మదిగా పూర్తి చేయండి. సాయంత్రం వేళ ప్రశాంతంగా గడుపుతారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks