...
...
Next Story

రోహిణి నక్షత్రంలోకి బుధుడి ప్రవేశం : ఈ 4 రాశుల వారికి లక్ష్మీ కటాక్షం - ఊహించని ధనలాభాలు!

Mercury Transit Rohini Nakshatra 2026 : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మే 19న బుధ గ్రహం అత్యంత పవిత్రమైన రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. మే 25 వరకు కొనసాగే ఈ సంచారం వల్ల 4 రాశుల వారి అదృష్టం మారిపోనుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

Published on: May 18, 2026, 12:28:48 IST
By , नई दिल्ली
Prefer HTon Google
Advertisement

Mercury Transit Rohini Nakshatra 2026 : నవగ్రహాలలో బుద్ధి, కమ్యూనికేషన్, వ్యాపారానికి కారకుడైన బుధ గ్రహం మే 19న కీలకమైన నక్షత్ర మార్పు చేయబోతోంది. చంద్రుడికి అత్యంత ప్రియమైన, సంపదను ఇచ్చే రోహిణి నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించనున్నాడు. హిందూ క్యాలెండర్ ప్రకారం….. మే 19, 2026 మంగళవారం మధ్యాహ్నం 02:37 గంటలకు బుధుడు రోహిణి నక్షత్రంలోకి అడుగుపెడతాడు. మే 25వ తేదీ ఉదయం వరకు బుధుడు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు.

రోహిణి నక్షత్రంలోకి బుధుడి ప్రవేశం
రోహిణి నక్షత్రంలోకి బుధుడి ప్రవేశం

జ్యోతిష్యశాస్త్రంలో రోహిణి నక్షత్రం అత్యంత శుభప్రదమైనదిగా, సమృద్ధిని ఇచ్చేదిగా పరిగణిస్తారు. చంద్రుడి నక్షత్రంలో బుధుడి సంచారం వల్ల దేశవ్యాప్తంగా వ్యాపార రంగాలు పుంజుకుంటాయి. ముఖ్యంగా 4 రాశుల వారి జీవితాల్లో ఈ మార్పు విపరీతమైన సానుకూల ప్రభావాలను, ఆర్థిక ప్రయోజనాలను తీసుకురాబోతోంది. ఆ అదృష్ట రాశుల వివరాలెంటో ఇక్కడ తెలుసుకోండి…

ఈ 4 రాశులపై ప్రభావం:

1. వృషభ రాశి : మే 19 నుండి మే 25 వరకు ఉన్న సమయం వృషభ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది. బుధుడు చంద్రుని నక్షత్రంలో సంచరించడం వల్ల మీ ఆర్థిక స్థితి విపరీతంగా మెరుగుపడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన లేదా ఎక్కడైనా ఇరుక్కుపోయిన డబ్బు ఈ కాలంలో మీ చేతికి అందుతుంది. ఉద్యోగం చేసే వారికి కార్యాలయంలో అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి, అలాగే పదోన్నతి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు తెచ్చే ఒక పెద్ద ఒప్పందం ఖరారవుతుంది. మీ మాట తీరు సమాజంలో అందరినీ ఆకట్టుకుంటుంది.

2. మిథున రాశి : మిథున రాశికి బుధ గ్రహమే అధిపతి. అందువల్ల, రోహిణి నక్షత్రంలో బుధుడి సంచారం మీకు ఎంతో ఫలవంతంగా మారుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు, రీసెర్చ్ లేదా పరిశోధన రంగాల్లో ఉన్న వ్యక్తులకు ఈ సమయం అత్యంత అనుకూలమైనది. మీలో ఏకాగ్రత పెరుగుతుంది. కుటుంబ జీవితంలో గత కొంతకాలంగా సాగుతున్న విభేదాలు, మనస్పర్థలు పూర్తిగా తొలగిపోతాయి. తోబుట్టువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీరు పెట్టే పెట్టుబడులు రాబోయే రోజుల్లో భారీ లాభాలను తెచ్చిపెడతాయి.

4. వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఈ సంచార కాలం భాగస్వామ్య వ్యాపారాలలో, వైవాహిక జీవితంలో అపారమైన సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు పార్ట్‌నర్‌షిప్ బిజినెస్ చేస్తుంటే, భాగస్వాముల మధ్య సమన్వయం మెరుగై లాభాలు రెట్టింపు అవుతాయి. జీవిత భాగస్వామితో బంధం మరింత బలోపేతం అవుతుంది. పాత కోర్టు వివాదాలు లేదా కుటుంబ గొడవలు ఉంటే చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుంటారు. ఊహించని మార్గాల ద్వారా అకస్మాత్తుగా ధనలాభం కలిగి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.

బుధ గ్రహ సంచారం వల్ల కలిగే శుభ ఫలితాలు మరింత పెరగడానికి జ్యోతిష్య నిపుణులు ఒక చిన్న పరిహారాన్ని సూచించారు. బుధవారం రోజున విఘ్నేశ్వరుడిని భక్తితో ఆరాధించాలి. అలాగే…. ఆవుకు పచ్చి గడ్డి లేదా తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలను తినిపించడం వల్ల బుధ దోషాలు తొలగిపోయి లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా జ్యోతిష్య శాస్త్ర నమ్మకాలు, గ్రహాల లెక్కింపుపై ఆధారపడి ఉంటుంది. దీనిని కేవలం సమాచారం కోసమే అందిస్తున్నాము. ఖచ్చితమైన ఫలితాల కోసం మీ వ్యక్తిగత జాతక చక్రాల ఆధారంగా నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks