బుధ శుక్రుల కలయిక: శక్తివంతమైన రాజయోగం, ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు.. అన్ని వైపుల నుండి ప్రేమ, విజయాన్ని పొందుతారు!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపావళి తర్వాత శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతోంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది, కానీ మూడు రాశుల వారు మాత్రం అనేక లాభాలను పొందుతారు. మరి ఏ రాశుల వారికి ఈ యోగాల వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి, ఎవరు ఎలాంటి లాభాలను పొందవచ్చో ఇప్పుడే తెలుసుకుందాం.

Published on: Oct 10, 2025, 13:30:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపావళి తర్వాత శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతోంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది, కానీ మూడు రాశుల వారు మాత్రం అనేక లాభాలను పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.

దీపావళి తరవాత మూడు గ్రహాల సంచారంలో మార్పుతో శుభ యోగాలు (pinterest)
దీపావళి తరవాత మూడు గ్రహాల సంచారంలో మార్పుతో శుభ యోగాలు (pinterest)

రాశుల సంచారంలో మార్పు

అక్టోబర్ 24న మధ్యాహ్నం 12:39కి బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత నవంబర్‌లో బుధుడు మళ్లీ వృశ్చిక రాశిలోకి రీ-ఎంట్రీ ఇస్తాడు. డిసెంబర్ 6న ఉదయం 8:52కి మళ్లీ వృశ్చిక రాశిలోకి రావడంతో రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడు నవంబర్ 26న బుధవారం వృశ్చిక రాశిలో ఉంటాడు. దీంతో బుధ–శుక్ర సంయోగం జరుగుతుంది.

దాంతో పాటుగా బుధ–శుక్ర యోగం కూడా ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారు ప్రత్యేక లాభాలను పొందుతారు. ముఖ్యంగా మూడు రాశుల వారి సమస్యలన్నీ తీరిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మరి ఏ రాశుల వారికి ఈ యోగాల వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి, ఎవరు ఎలాంటి లాభాలను పొందవచ్చో ఇప్పుడే తెలుసుకుందాం.

దీపావళి తరవాత మూడు గ్రహాల సంచారంలో మార్పుతో శుభ యోగాలు.. ఈ రాశులకు అనేక లాభాలు

1.వృషభ రాశి:

వృషభ రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ రాశి వారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి కూడా బాగా కలిసి వస్తుంది.

వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. ఆస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. తల్లి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కూడా ఈ సమయంలో ఈ రాశి వారు పూర్తి చేస్తారు.

2.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం సానుకూల ఫలితాలను తీసుకొస్తుంది. ఈ రాశి వారి వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ప్రేమ జీవితం అద్భుతంగా సాగుతుంది. వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.

3.తులా రాశి:

తులా రాశి వారికి రాజయోగం బాగా కలిసి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. మీ ఇంట్లో సానుకూల వాతావరణాన్ని చూస్తారు. ఈ రాశి వారి సమయంలో కెరీర్‌లో కూడా పైస్థానంలో ఉంటారు. విద్యార్థులు పరీక్షల్లో సక్సెస్ ని అందుకుంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More