...
...
Next Story

కొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారికి కాసుల వర్షం, లక్ష్మీనారాయణ యోగంతో ప్రమోషన్లు, ప్రాజెక్టులు ఇలా ఎన్నో!

త్వరలోనే లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతోంది. ఇది బుధ, శుక్ర గ్రహాల కలయికతో ఏర్పడబోతోంది. ఈ రాజయోగం శని రాశి అయినటువంటి కుంభరాశిలో ఏర్పడింది. ఫిబ్రవరి 3న గ్రహాల రాజైన బుధుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 6న శుక్రుడు కూడా కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది.

Published on: Jan 26, 2026, 10:00:32 IST
Advertisement

గ్రహాలు కాలనుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తుంది. త్వరలోనే లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతోంది. ఇది బుధ, శుక్ర గ్రహాల కలయికతో ఏర్పడబోతోంది. ఈ రాజయోగం శని రాశి అయినటువంటి కుంభరాశిలో ఏర్పడింది. ఫిబ్రవరి 3న గ్రహాల రాజైన బుధుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 6న శుక్రుడు కూడా కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది.

లక్ష్మీనారాయణ యోగం

కొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారికి కాసుల వర్షం (pinterest)
కొన్ని రోజులు ఓపిక పడితే ఈ రాశుల వారికి కాసుల వర్షం (pinterest)

ఈ యోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, ఆర్థికపరంగా లాభాలు, వ్యాపారంలో కలిసి రావడం, ఆనందం, వాహనాలు ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.

త్వరలో కుంభరాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం

1.మేష రాశి

మేష రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం బాగా కలిసి వస్తుంది. ఇది వారి అదృష్టాన్ని పెంపొందిస్తుంది. కొత్త ఉద్యోగం వస్తుంది. సానుకూల మార్పులను చూస్తారు. కొత్త ప్రాజెక్టులను చేపడతారు.

వివాహం కాని వారికి వివాహ కుదిరే అవకాశం ఉంది. ఇప్పటికే రిలేషన్‌షిప్‌లో ఉన్నవారికి ఆనందం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. పని ప్రదేశంలో ప్రశంసలను పొందుతారు. తండ్రితో మరింత ప్రేమగా ఉంటారు.

2.సింహ రాశి

సింహ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. లక్ష్మీ నారాయణ యోగంతో వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

కుంభ రాశి వారికి ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు ఆనందంగా ఉంటారు. లక్ష్మీ నారాయణ యోగంతో కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త ఉద్యోగాన్ని కూడా పొందుతారు. అదృష్టం కలిసి వస్తుంది.

ఉద్యోగులకు కూడా ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఈ యోగం ఆనందాన్ని, ఆర్థిక లాభాలను తీసుకొస్తుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks