...
...
Next Story

June Astrology : 30 రోజుల అదృష్టం.. జూన్‌ నెలలో రాజయోగాన్ని చూసే 5 రాశులు

June Astrology : జూన్‌లో కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. గ్రహాల సంచారంతో 30 రోజులు ఏ రాశులవారికి లక్కు ఉంటుందో చూడండి.

Published on: May 25, 2026, 20:48:21 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జాతకంలో వివిధ రకాల రాజయోగాలు ఉంటాయి. ప్రతి రాజయోగానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని యోగాలు శుభప్రదమైనవి. అవి జీవితంలోని కష్టాలను తగ్గిస్తాయి. కొన్ని యోగాలకు సమస్యలను పెంచే శక్తి ఉంటుందని నమ్ముతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. జూన్ నెలలో సూర్య, గురు గ్రహాలు ఒకే రాశిలో కలవడం వల్ల 5 రాశుల వారికి అదృష్టం, ధనం, వృత్తిపరమైన శ్రేయస్సు దొరుకుతాయి. ఏ రాశులకు రాజయోగం ఉంటుందో తెలుసుకోండి.

కర్కాటకం

జూన్ జ్యోతిష్యం
జూన్ జ్యోతిష్యం

ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కొన్ని వృత్తులలో మీకు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తిపరమైన పనిలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు అనుకున్న పనులు చాలా వరకు అవుతాయి.

కన్యారాశి

ఈ కాలంలో అనుకోని ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అమ్మకాలలో కొత్త లాభాలు పొందుతారు. పనిలో ఆటంకాలు ఎదురైనా, ధైర్యంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది.

తులారాశి

తులా రాశివారు వృత్తిపరమైన ఉద్యోగాలలో ఆశించిన స్థానాలను పొందుతారు. మీ కెరీర్‌లో అడ్డంకులను అధిగమిస్తారు. పిల్లలు చదువులో పురోగతి సాధిస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. దూర ప్రాంతాల్లోని స్నేహితుల నుండి మీరు ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు.

మకర రాశి

పై అధికారుల మద్దతుతో ఉద్యోగులు హోదాను పొందుతారు. సమాజంలో మీ గౌరవం, మర్యాద పెరుగుతాయి. శత్రువుల నుండి మీకు ఊహించని ఫోన్ కాల్స్ వస్తాయి. మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి సలహాతో మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

మీన రాశి

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe