...
...
Next Story

నవ పంచమ యోగం : నేటి నుంచి ఈ 3 రాశులకు సువర్ణ కాలం - అదృష్టం మీ వైపే…!

జూలై 18, 2026 రాత్రి చంద్రుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో వృషభ రాశిలో ఉన్న అంగారకుడితో కలిసి శక్తివంతమైన 'నవపంచమ యోగం' ఏర్పడుతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ సంచారం కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారికి అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను, కెరీర్ ఎదుగుదలను తీసుకురానుంది.

Published on: Jul 18, 2026 07:14 PM IST
By , नई दिल्ली
Prefer HTon Google
Advertisement

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల మార్పులు, వాటి కలయికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మనస్సుకు కారకుడైన చంద్రుడు, గ్రహాల కమాండర్‌గా పిలవబడే అంగారకుడి (కుజుడు) సంచారం అత్యంత ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం అంగారకుడు వృషభ రాశిలో ఉన్నాడు. కాగా, హిందూ క్యాలెండర్ ప్రకారం జూలై 18, 2026 (శనివారం) రాత్రి 11:58 గంటలకు చంద్రుడు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జూలై 21 వరకు చంద్రుడు ఇదే రాశిలో ఉంటాడు.

చంద్ర, అంగారకుల సంచారం
చంద్ర, అంగారకుల సంచారం

చంద్రుడి ఈ రాశి మార్పు వల్ల ఆకాశంలో ఒక అద్భుతమైన జ్యోతిష్య ఘట్టం ఆవిష్కృతం కానుంది. చంద్రుడు, అంగారక గ్రహాల కలయిక వల్ల ‘నవపంచమ యోగం’ ఏర్పడబోతోంది.

ప్రముఖ జ్యోతిష్య పండితులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం…. చంద్రుడు కన్యారాశిలోకి వెళ్లినప్పుడు, అంగారకుడు ఐదవ ఇంటికి, అలాగే అంగారకుడి నుంచి చంద్రుడు తొమ్మిదవ ఇంటికి వెళ్తాడు. రెండు గ్రహాలు ఒకదానికొకటి 5, 9 స్థానాల్లో ఉన్నప్పుడు ఈ ‘నవపంచం యోగం’ ఏర్పడుతుంది. ఈ యోగం ప్రారంభం కావడంతో కొన్ని రాశుల వారికి సువర్ణ కాలం మొదలవుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ సమయం ఒక వరం కంటే తక్కువ కాదని పండితులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇప్పుడు చూద్దాం…

1. కర్కాటక రాశి :

నవపంచమ యోగం ఏర్పడటం వల్ల కర్కాటక రాశి వారికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో విజయం, ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కష్టకాలంలో స్నేహితుల నుంచి ఊహించని మద్దతు లభిస్తుంది. అదృష్టం మీ వైపు ఉండటం వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారస్తులకు బంపర్ లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

2. వృశ్చిక రాశి:

నవపంచం యోగం మీన రాశి వారికి అత్యంత ప్రయోజనకరంగా మారనుంది. గత కొంతకాలంగా జీవితంలో వేధిస్తున్న మానసిక, ఆర్థిక సమస్యలు నెమ్మదిగా తగ్గడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది, కొత్త పెట్టుబడులకు ఇది అనుకూల సమయం. కుటుంబంలో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe