మకర రాశిలో చంద్రుడి సంచారం.. నేటి నుంచి ఈ 7 రాశులకు ధన లాభం, ఉద్యోగ పురోగతి!
చంద్రుడు మకర రాశిలో సంచరించడం వల్ల మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. అయితే మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీనం రాశుల వారికి ప్రత్యేకంగా అనుకూల ఫలితాలు కలగవచ్చని జ్యోతిష్య విశ్వాసం.
చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో మేషం నుంచి మీనం వరకు రాశులపై ప్రత్యేక ప్రభావం పడనుంది. ముఖ్యంగా ఏడు రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుండగా, ధన లాభం, ఉద్యోగంలో పురోగతి కలుగుతాయి.

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తాజాగా, మనసునకు, భావోద్వేగాలకుకారకుడైన చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించారు. సెప్టెంబర్ 23 వరకు చంద్రుడు ఇదే రాశిలో సంచరించనున్నారు. మకర రాశికి శని భగవానుడు అధిపతి. శని దేవుడు క్రమశిక్షణ, కష్టపడే తత్వానికి ప్రతీకగా నిలుస్తాడు. భావోద్వేగాల చంద్రుడు, కఠిన దీక్షాసక్తులు కలిగిన శని రాశిలో కలవడం వల్ల కొద్దిరోజుల పాటు ప్రత్యేకమైన ఫలితాలు గోచరిస్తాయి. ఈ అరుదైన గ్రహ స్థితి కారణంగా మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులపై ప్రభావం ఉన్నప్పటికీ, ఏడు అదృష్ట రాశుల వారికి మాత్రం ఊహించని ప్రయోజనాలు చేకూరనున్నాయి.
మకర రాశిలో చంద్రుడి ప్రవేశం వల్ల ఏయే రాశుల వారు ఎలాంటి లాభాలు కలుగుతాయి?
మేష రాశి: ధన లాభానికి బలమైన మార్గాలు
మేష రాశి వారికి ఈ కాలంలో ఆర్థిక పరమైన లాభాలు అందే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ వేగవంతం అవుతాయి. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టవచ్చు. ఆర్థిక ప్రణాళికలు సఫలమై మార్కెట్లో మంచి పేరు సంపాదిస్తారు. తల్లిదండ్రుల నుంచి పూర్తి స్థాయి మద్దతు లభించడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది.
వృషభ రాశి: అష్టైశ్వర్యాలు, భూలాభాలు
ఈ రాశి వారికి చంద్ర సంచారం సుఖసంతోషాలను తెచ్చిపెడుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాలు సొంతమవుతాయి. ఆస్తిపాస్తులు, ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి పురోగతి కనిపిస్తుంది.
కర్కాటక రాశి: ఉద్యోగ అవకాశాలు, శుభవార్తలు
కర్కాటక రాశికి అధిపతి స్వయంగా చంద్రుడే కావడం విశేషం. ఈ గోచారఫలితంగా ఈ రాశి వారికి శుభ వార్తలు వినే అవకాశం ఉంది. చాలాకాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తగిన గుర్తింపు లభిస్తుంది. మిత్రుల సహకారంతో కొత్త వ్యాపార విస్తరణ సాధ్యపడుతుంది. అదృష్టం తోడు నిలిచి ప్రతి పనిలోనూ సఫలీకృతులవుతారు.
తులా రాశి: ఆర్థిక స్థిరత్వం, ఆదాయ వనరులు
తులా రాశి వారికి ఈ చంద్ర సంచారం అత్యంత లాభదాయకంగా మారుతుంది. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి స్థాయి ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడం వల్ల క్లిష్టమైన నిర్ణయాలను సైతం సులభంగా అమలు చేస్తారు.
వృశ్చిక రాశి: విద్యార్థులకు సువర్ణావకాశం
వృశ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా విద్యారంగంలో ఉన్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. నిర్దేశిత లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా మారుతుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న మానసిక, శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మకర రాశి: వృత్తిరీత్యా ఉన్నత గుర్తింపు
చంద్రుడు స్వయంగా మకర రాశిలోకి రావడంతో ఈ రాశి ఉద్యోగులకు అద్భుతమైన కాలం నడుస్తోంది. కార్యాలయంలో మీ ప్రతిభను, కష్టాన్ని పైఅధికారులు గుర్తించి ప్రశంసిస్తారు. కీలకమైన బాధ్యతలు మీ చేతికి రావచ్చు. సమాజంలో హోదా పెరగడంతో పాటు ధన లాభ సూచనలు స్పష్టంగా ఉన్నాయి.
మీన రాశి: ప్రయాణాలు, కుటుంబ సౌఖ్యం
మీన రాశి వారికి ఈ గోచార కాలం ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలను సృష్టిస్తుంది. చేసే ప్రయాణాలు లాభసాటిగా ముగుస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు జరగడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొని ప్రియమైన వారి మద్దతు లభిస్తుంది. అదృష్టం వెన్నంటి ఉండటం వల్ల చేపట్టిన పనుల్లో విజయదుందుభి మోగిస్తారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


