Moon Transit: నేటి నుంచి ఈ 3 రాశులకు చంద్ర సంచారంతో సమస్యలు పెరుగుతాయి.. జాగ్రత్త సుమా!
ఫిబ్రవరి 10, అనగా ఈ రోజు, చంద్రుడు రాశి మార్పు చెందాడు. చంద్రుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చంద్ర సంచారంలో మార్పు వలన ఏ రాశుల వారికి ఇబ్బందులు కలగబోతున్నాయి? ఎవరు ఏ విధంగా సమస్యలను ఎదుర్కోబోతున్నారు?
గ్రహాలు ఎప్పటికప్పుడు సంచారంలో మార్పులు చేస్తూ ఉంటాయి. చంద్రుడు మనసుకు, తల్లి, మానసిక స్థితి, సృజనాత్మకతకు కారకుడు. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, మనసును చంద్రుడు నియంత్రిస్తాడు. మానసిక స్థిరత్వం, భావోద్వేగ శ్రేయస్సుపై ఎంతో ప్రభావం చూపిస్తాడు.

చంద్రుడు వేగంగా కదిలే గ్రహం. రెండున్నర రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు. చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే వ్యక్తి మానసికంగా బలంగా, దృఢంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. బలహీనమైన చంద్రుడు వలన జ్ఞాపకశక్తి లోపం, మానసిక బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి.
చంద్ర సంచారంలో మార్పు
ఫిబ్రవరి 10, అనగా ఈ రోజు, చంద్రుడు రాశి మార్పు చెందాడు. చంద్రుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చంద్ర సంచారంలో మార్పు వలన ఏ రాశుల వారికి ఇబ్బందులు కలగబోతున్నాయి? ఎవరు ఏ విధంగా సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రుడి సంచారంలో మార్పు.. మూడు రాశులకు సమస్యలు రావచ్చు
1.మేష రాశి
మేష రాశి వారికి చంద్ర సంచారంతో కొన్ని సమస్యలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారి ఒత్తిడి పెరుగుతుంది. పాత సమస్యలు మళ్లీ పెద్దవిగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో మానసికంగా కూడా సమస్యలు ఎదురవుతాయి.
కుదిరితే మీకు దగ్గరగా ఉన్న వారి సలహాలు తీసుకోండి. గొడవలు కూడా ఈ సమయంలో పెరిగే అవకాశం ఉంది. మేష రాశి వారు ప్రేమ విషయాలకు సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండాలి. సహనం చాలా ముఖ్యం.
2.మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు చంద్ర సంచారంలో మార్పు వలన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి సమస్యలు పెరుగుతాయి. రిలేషన్‌షిప్‌లో కూడా ఇబ్బందులు వస్తాయి.
ఏదైనా కొత్త ఉద్యోగం లేదా ప్రయాణాలు మొదలు పెట్టాలనుకుంటే కాస్త ఆలోచించి చేయండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అనారోగ్య సమస్యలు వస్తే జాగ్రత్తగా ఉండండి. ఆర్ట్‌కు సంబంధించిన రంగాల్లో పని చేసే వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
3.ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి చంద్రుని రాశి మార్పు వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారు బాగా అలసిపోతారు. ముఖ్యమైన పనులను పూర్తి చేయడం కష్టంగా ఉంటుంది.
అనుకున్న వాటిని సమయానికి పూర్తి చేయలేకపోవచ్చు. మానసిక సమస్యలు పెరుగుతాయి. ఏదైనా ముఖ్యమైన పనిని మొదలుపెట్టే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించడం చాలా అవసరం. అలాగే ఈ రాశి వారు ఇతరులను గౌరవించి, కాస్త గర్వాన్ని తగ్గించుకుంటే మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


