వైదిక జ్యోతీష్య శాస్త్రంలో చంద్రుని సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రతి రాశిలోనూ నిర్దిష్ట కాలం పాటు సంచరిస్తూ, మానసిక స్థితిపై, భౌతిక సుఖాలపై చంద్రుడు తీవ్ర ప్రభావం చూపుతాడు. ప్రస్తుతం మేష రాశిలో ఉన్న చంద్రుడు సెప్టెంబర్ 30, 2026 నాడు వృషభ రాశిలోకి అడుగుపెట్టనున్నారు. అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు చంద్రుడు ఇదే రాశిలో సంచరిస్తాడు.

వృషభ రాశిలో చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. అంటే ఈ రాశిలో చంద్రుడు అత్యంత శక్తివంతంగా మారి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడితో చంద్రుడికి స్నేహ సంబంధం ఉంది. శుక్రుడు భోగభాగ్యాలు, ఐశ్వర్యం, సౌందర్యానికి కారకుడు. దీంతో ఈ గోచార కాలంలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు దక్కనున్నాయి.
వృషభ రాశి: సుఖ-సమృద్ధి ప్రాప్తి
తన సొంత రాశికి సమీపంలో లేదా శుక్రుడి క్షేత్రమైన వృషభంలోనే చంద్రుని సంచారం జరుగుతుండటంతో ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనస్సు చాలా ప్రశాంతంగా, అటు సంయలనంతో ఉంటుంది. కుటుంబ జీవితంలో ఎలాంటి అలజడి లేకుండా ఆనందంగా గడుపుతారు. అనుకోని మార్గాల ద్వారా ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. మీ వ్యక్తిత్వంలో ప్రత్యేక ఆకర్షణ పెరుగుతుంది, తీసుకునే నిర్ణయాలు సరైన మార్గంలో నడిపిస్తాయి.
కర్కాటక రాశి: భౌతిక సుఖాల వృద్ధి
శుక్ర గోచార ప్రభావం కూడా తోడవడంతో కర్క రాశి వారికి భౌతిక సుఖ-సౌకర్యాలు పుష్కలంగా లభిస్తాయి. నూతన భూములు, ఇళ్లు లేదా వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉంది. ఆర్థిక పరంగా బలోపేతం అవుతారు. మీ మాట తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది, మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. జీవిత భాగస్వామితో బంధం మరింత మధురంగా మారుతుంది.
సింహ రాశి: అసాధారణ ఆత్మవిశ్వాసం
సింహ రాశి వారికి ఈ సమయంలో సాహసం, శక్తి, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. మీ ముఖవర్చస్సులో తేడా కనిపిస్తుంది, అందరినీ ఆకట్టుకునే శక్తి పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు మళ్లీ వేగంగా పూర్తవుతాయి. వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అదృష్టం తోడు నిలిచి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు.
వృశ్చిక రాశి: అన్ని వైపుల నుంచీ లాభాలు
{{/usCountry}}సింహ రాశి వారికి ఈ సమయంలో సాహసం, శక్తి, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. మీ ముఖవర్చస్సులో తేడా కనిపిస్తుంది, అందరినీ ఆకట్టుకునే శక్తి పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు మళ్లీ వేగంగా పూర్తవుతాయి. వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అదృష్టం తోడు నిలిచి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు.
వృశ్చిక రాశి: అన్ని వైపుల నుంచీ లాభాలు
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి ఈ చంద్ర గోచారం ఒక వరంలా మారుతుంది. ప్రతి రంగంలోనూ శుభవార్తలు వింటారు, లాభాలు వెల్లువెత్తుతాయి. మీలో సానుకూల శక్తి పెరిగి, పెండింగ్ పనిభారాన్ని ఇట్టే ముగిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి.
కుంభ రాశి: వాహన, గృహ ప్రాప్తి
కుంభ రాశి వారికి ఆస్తులు కొనుగోలు చేసే అదృష్టం ఉంది. ఇల్లు, స్థలం లేదా వాహనం కొనుగోలు చేసేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంది. అయితే, కుటుంబంలో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నందున కాస్త ఓపికగా వ్యవహరించడం మంచిది. సంతానం ద్వారా ఆనందకరమైన వార్తలు వింటారు. ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.
మీన రాశి: జీవిత భాగస్వామితో అన్యోన్యత
మీన రాశి వారి పరాక్రమం సత్ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. చంద్రుని శుభ ప్రభావం మీ మేథస్సును పెంచుతుంది. ఆఫీసులో మీ పనితీరు చూసి అధికారులు ప్రశంసిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతుతో ముఖ్యమైన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.